చరణ్ అభిమానులకు చిక్కిన ‘బింబిసార’ డైరెక్టర్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. దెబ్బకు అకౌంట్ లాక్!

By Asianet News  |  First Published Apr 13, 2023, 4:36 PM IST

‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ఠపై మెగా పవర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆయన చేసిన పనికి చెర్రీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంటనే ఆయన సోషల్ మీడియా అకౌంట్ ను లాక్ చేసుకున్నారు. 


నందమూరి కళ్యాణ్ రామ్ తో ‘బింబిసార’ చిత్రాన్ని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ వశిష్ఠ (Vassishta) తొలిచిత్రంతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. పూర్తి ఫిక్షన్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా సెన్సేషన్ క్రియేట్ చేశారు. దీంతో టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ల జాబితాలో ఈయన కూడా చోటు దక్కించుకున్నారు. అయితే తాజాగా వశిష్ఠ వార్తల్లో నిలిచారు. ఆయన చేసిన పనికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ చిర్రెత్తిపోతున్నారు. 

ప్రస్తుతం వశిష్ఠపై చరణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశారనే విషయానికొస్తే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ను ట్రోల్ చేస్తున్న ఓ పోస్ట్ ను డైరెక్టర్ వశిష్ఠ లైక్ చేశాడంట. ఆ విషయాన్ని చెర్రీ ఫ్యాన్స్ గుర్తించారు. తమ అభిమాన హీరోను ట్రోల్ చేస్తున్న పోస్ట్ ను ఎలా లైక్ చేస్తారంటూ మండిపడుతున్నారు. దీంతో వశిష్ఠను గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. ఫ్యాన్స్ దెబ్బకు ఏకంగా ట్వీటర్ అకౌంట్ ను లాక్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది.

Latest Videos

 

ప్రస్తుతం చరణ్ గ్లోబల్ స్టార్ గా కీర్తి పొందుతున్న తరుణంలో వశిష్ట అలా చేయడం వివాదంగా మారిందనే చెప్పాలి. మళ్లీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతారో చూడాలి. ఇక వశిష్ఠ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపించింది. ఇప్పటికే కథ కూడా చెప్పారని, చిరుసైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు త్వరలో ‘బింబిసార ‌2’ను కూడా ప్రారంభించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఎలాంటి మూవ్ తీసుకుంటారో తీసుకోవాలి. 
 

click me!