'సైరా' ఎందుకు చూడాలి.. మెగాస్టార్ కు కోడలి ప్రశ్న!

Published : Aug 05, 2019, 07:07 PM IST
'సైరా' ఎందుకు చూడాలి.. మెగాస్టార్ కు కోడలి ప్రశ్న!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది. రాంచరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇటీవల మెగా కోడలు ఉపాసన చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఉపాసన చిరుకి ఆసక్తికర ప్రశ్నలు సంధించింది. మావయ్య.. సైరా చిత్రాన్ని యువత ఎందుకు చూడాలి అంటే ఏం చెబుతారు అని ప్రశ్నించింది. దీనికి చిరు సమాధానం ఇస్తూ సైరా చిత్రం యువతకు చాలా ముఖ్యమైనది అని తెలిపారు. 

మనం అనుభవిస్తున్న స్వేచ్ఛని, స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నాం. దీని వెనుక ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగం దాగిఉంది. ఆ త్యాగాలని ప్రస్తుత తరం క్రమంగా మరచిపోతోంది. వీరుల త్యాగాలు మరుగునపడిపోతున్నాయి. ఎందరో వీరుల ప్రాణత్యాగాల గురించి వింటున్నప్పుడు మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సైరా చిత్రం అలా ఉండబోతోందని చిరంజీవి తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

150 కోట్ల ఇల్లు, 7 కోట్ల కారు, రజినీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ ఆస్తి ఎంత? రెమ్యునరేషన్ వివరాలు?
చీరకట్టులో ప్రభాస్ హీరోయిన్, కుందనపు బొమ్మ నిధి అగర్వాల్.. వైరల్ ఫోటోషూట్