మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా భార్య ఉపాసన కొణిదెల స్పెషల్ విషెస్ తెలిసింది. రొమాంటిక్ పిక్స్ ను షేర్ చేసుకుంటూ చాలా బ్యూటీఫుల్ గా శుభాకాంక్షలు తెలియజేసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ ఎక్కడ చూసిన ఆయన ఫ్యాన్స్ హంగామానే కనిపించింది. చెర్రీ బర్త్ డే కావడంతో ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ చరణ్ కు స్పెషల్ విషెస్ తెలిపారు. ఇప్పటికే తండ్రి చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు సహా అందరూ ప్రత్యేకంగా చరణ్ ను విష్ చేశారు. ఆయన మరింత ఆరోగ్యంగా, కేరీర్ లో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. చరణ్ అభిమానులు నెట్టింట బర్త్ డే పోస్టర్లతో తెగ సందడి చేశారు.
తాజాగా చరణ్ కు భార్య ఉపాసన కొణిదెల (Upasana Konidela) స్పెషల్ విషెస్ తెలిపింది. ‘హ్యాపీ హ్యాపీ బర్త్ డే బెస్టీ’ అంటూ రెడ్ హార్ట్ సింబల్ ను జోడించింది. ఈ సందర్బంగా బ్యూటీపుల్ అండ్ మెమోరబుల్ ఫొటోలను కూడా పంచుకుంది. ఒక ఫొటోలో చరణ్ భుజంపై ఉపాసన తల వాల్చగా.. మరో ఫొటోలో ఉపాసన కాళ్లపై చరణ్ కూర్చున్న మరో ఫొటోను పంచుకుంది. ఈ రెండు రెండు రేర్ పిక్స్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.
రామ్ చరణ్ - ఉపాసనకు 2012లో పెళ్లైన విషయం తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో అత్యంత గ్రాండ్ గా జరిగిన సెలబ్రెటీల వివాహాల్లో వీరిది కూడా ఒకటి. పెళ్లైన పదేండ్ల వరకు చరణ్, ఉపాసన మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో టూర్లు, వేకేషన్స్ కు వెళ్తూ చక్కటి సమయాన్ని గడిపారు. ఈ జంట గతేడాది గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఉపాసనకు ఆరో నెల అని చరణ్ వెల్లడించిన విషయం తెలిసిందే.
చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులకు డబుల్ ట్రీట్ అందిన విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న చిత్రం RC15 నుంచి టైటిల్, లోగో, ఫస్ట్ లుక్ విడుదలయ్యాయి. కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న తరుణంలో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందడంతో చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవ్. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Happy Happy Birthday Bestie ❤️ pic.twitter.com/cqS2siLdSM
— Upasana Konidela (@upasanakonidela)