సోనాక్షి ఓ డబ్బు పశువు.. మంత్రి ఘాటు వ్యాఖ్యలు!

Published : Sep 24, 2019, 02:07 PM ISTUpdated : Sep 24, 2019, 02:13 PM IST
సోనాక్షి ఓ డబ్బు పశువు.. మంత్రి ఘాటు వ్యాఖ్యలు!

సారాంశం

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రి.. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను జంతువుతో పోల్చారు. దాంతో ఈ విషయం కాస్తా చర్చనీయాంశంగా మారింది.  

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా రామాయణానికి సంబంధించిన ఓ చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేక తిప్పలు పడి నెటిజన్లను అడ్డంగా దొరికేసింది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి గెస్ట్ గా వెళ్లిన సోనాక్షికి రామాయణానికి సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. 

‘రామాయణం ప్రకారం.. హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తెచ్చాడు?’ అని అమితాబ్ ప్రశ్నించి.. దానికి ఆప్షన్స్ గా ఎ. సుగ్రీవుడు, బి. లక్ష్మణుడు సి. సీత, డి.రాముడు అని ఇచ్చారు. రామాయణం మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నా.. సమాధానం 'లక్ష్మణుడు' అని కరెక్ట్ గా చెప్పేవారు.కానీ సోనాక్షికి రామాయణం గురించి తెలియక దీనికి కూడా లైఫ్ లైన్ తీసుకున్నారు.

దీంతో నెటిజన్లు #YoSonakshiSoDumb పేరిట హ్యాష్ ట్యాగ్‌ను ప్రారంభించి ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఈ విషయంపై ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సునీల్ భరాలా అనే మంత్రి స్పందించారు. సోనాక్షి ఓ డబ్బు పశువు అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఇలాంటి వాళ్లు డబ్బు కోసమే ఆలోచిస్తారు కానీ మంచి విషయాలు నేర్చుకోవడానికి అసలు శ్రద్ధ చూపరని ఆరోపణలు చేశారు.

ఈ కాలంలో ఇలాంటి నటీనటులు కేవలం డబ్బు కోసమే బతుకుతున్నారని.. డబ్బు ఎలా సంపాదించాలి..? ఎలా ఖర్చు పెట్టాలనే తప్ప చరిత్ర గురించి కానీ దేవుళ్ల గురించి కానీ అసలు నేర్చుకోవడం లేదని.. ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదని మండిపడ్డారు. మరి ఈ వ్యాఖ్యలపై సోనాక్షి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌