Unstoppable2: ప్రభాస్‌ ఎపిసోడ్‌ పార్ట్ 2 ప్రోమో.. అమ్మాయి గురించే గోపీచంద్‌తో గొడవ?

By Aithagoni RajuFirst Published Jan 4, 2023, 9:55 PM IST
Highlights

ప్రభాస్‌ పాల్గొన్న `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే2` పార్ట్ 2 లేటెస్ట్ ప్రోమో విడుదలైంది.  ఇందులో ప్రభాస్‌, గోపీచంద్‌ మధ్య ఓ అమ్మాయి గురించి గొడవ జరగడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ప్రభాస్‌.. ఫస్ట్ టైమ్‌ టాక్‌ షోకి వచ్చిన విషయం తెలిసిందే. బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే` సీజన్‌ 2 షోకి ప్రభాస్‌ వచ్చారు. దీంతో ఈ షో రేంజ్‌ మారిపోయింది. ప్రభాస్‌తోపాటు గోపీచంద్‌ కూడా ఈ షోకి వచ్చారు. దీంతో ఈ షోని `బాహుబలి` ఎపిసోడ్‌గా పిలుస్తున్నారు. ఇప్పటికే పార్ట్ 1 ఎపిసోడ్‌ అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2ని రిలీజ్‌ చేయబోతున్నారు. రేపు అర్థరాత్రి(జనవరి 6) నుంచి ఇది స్ట్రీమింగ్‌ కానుంది. 

తాజాగా రెండో పార్ట్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో ప్రభాస్‌, గోపీచంద్‌ మధ్య ఓ అమ్మాయి గురించి గొడవ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. గోపీచంద్‌ ఏదో చెప్పగా, చెబితే ఫుల్‌గా చెప్పు, ఇలా సగం సగం చెప్పకు అంటూ ప్రభాస్‌ ఫైర్‌ అవుతున్నాడు. అప్పుడు బాలకృష్ణ.. గోపీచంద్‌కి అడ్డుగా ఉంటూ ఆయన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ప్రభాస్‌పై కామెంట్‌ కూడా చేశారు. `ఈ సెక్షన్‌ ఏంటంటే ఎక్కడ నిజం బయటపడబోతుందో అని దబాయించడం` అని తెలిపారు. 

ఈ సందర్భంగా `వార్నింగ్‌ లు వద్దమ్మా` అని బాలయ్య అనగా, `మరి ఏ అమ్మాయి అని ఎందుకు?` అని ప్రభాస్‌ చిలిపిగా ప్రశ్నించగా, అబ్బా నాకే ట్విస్టా? అంటూ బాలయ్య రియాక్ట్ కావడంతో ప్రభాస్‌ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అదిరిపోయింది. ఇంతలో బాలయ్య ఓ అదిరిపోయే ప్రశ్న అడిగారు. `బాహుబలి`తర్వాత ఎటు స్టెప్‌ వేయాలి.. ఆ టైమ్‌లో మీ మైండ్‌ సెట్‌ ఏంటి? అన్ని ప్రశ్నించగా, `ఇండియా అందరికి ఏ సినిమా చేయాలి.. కష్టం ఎక్కువ పడ్డాను.. ` అని ఆ సందర్భంగా గురించి వివరించారు ప్రభాస్‌. ఇది ఆసక్తిని రేకెత్తిస్తుంది. 
 

click me!