Namrata Shirodkar: వదినమ్మా మీరు సూపర్... మహేష్ వైఫ్ నమ్రత స్టైలిష్ లుక్ వైరల్!

Published : Dec 27, 2022, 10:23 AM IST
Namrata Shirodkar: వదినమ్మా మీరు సూపర్... మహేష్ వైఫ్ నమ్రత స్టైలిష్ లుక్ వైరల్!

సారాంశం

మహేష్ ఫ్యామిలీ స్విట్జర్లాండ్ టూర్లో ఉన్నారు. తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు మహేష్ వైఫ్ నమ్రత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు. నమ్రత స్టైలిష్ లుక్ వైరల్ గా మారింది.   

విరామం దొరికితే చాలు విదేశాలకు చెక్కేస్తారు మహేష్(Mahesh Babu) ఫ్యామిలీ. టాలీవుడ్ లో ఏ స్టార్ ఫ్యామిలీ కూడా ఈ రేంజ్ లో టూర్స్ కి వెళ్ళరు. ఫ్యామిలీని అమితంగా ప్రేమించే మహేష్ ఏడాదిలో ఐదారు ఇంటర్నేషనల్ టూర్స్ ప్లాన్ చేస్తారు. షూటింగ్ కి గ్యాప్ దొరికితే దాదాపు విదేశాల్లో విహరిస్తారు మహేష్ కుటుంబం. ఇటీవల న్యూ  ఇయర్ వేడుకలు కోసం మహేష్-నమ్రత పిల్లలు గౌతమ్, సితారలతో పాటు స్విట్జర్లాండ్ వెళ్లారు. ప్రస్తుతం వీరు ఆ దేశంలోని టూరిస్ట్ నగరం లాజెర్న్న్ లో ఉన్నారు. అక్కడే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుపుకోనున్నారు. 

ఇక వెకేషన్ లో నమ్రత(Namrata Shirodkar) వింటర్ వేర్ లో దిగిన ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆమె లుక్ చాలా స్టైలిష్ గా ఉంది. నమ్రత వెకేషన్ ఫోటో వైరల్ గా మారింది. నమ్రత ఫోటో చూసిన మహేష్ ఫ్యాన్స్... వదినమ్మా మీరు సూపర్ అంటూ కామెంట్స్ రూపంలో కితాబు ఇస్తున్నారు. 

ఇక స్విట్జర్లాండ్ నుండి రాగానే మహేష్ త్రివిక్రమ్ చిత్ర షూట్ లో పాల్గొంటారు. దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ పై లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. 2023 సమ్మర్ కానుకగా ఎస్ఎస్ఎంబి 28(SSMB 28) విడుదల చేస్తామంటూ గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆ సూచనలు లేవు. అసలు షూట్ పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. ఫస్ట్ షెడ్యూల్ అనంతరం కూడా స్క్రిప్ట్ లో మార్పులు చేశారనే టాక్ ఉంది. 2023 చివర్లో విడుదలయ్యే సూచనలు కలవు. మరోవైపు రాజమౌళితో మహేష్ చేయాల్సిన చిత్రం మే లేక జూన్ లో సెట్స్ పైకి వెళ్లనుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. 

త్రివిక్రమ్-మహేష్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీలీల మరో హీరోయిన్ గా ఎంపికయ్యారంటూ కథనాలు వస్తున్నాయి. అధికారిక సమాచారం లేదు. అలాగే సీనియర్ హీరోయిన్ శోభన మహేష్ తల్లి పాత్ర చేస్తున్నారనే పుకారు ఉంది. థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా