biggboss5ః దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే అంటూ విరుచుకుపడ్డ ఉమాదేవి.. అర్హత లేదంటున్న షణ్ముఖ్‌

Published : Sep 13, 2021, 08:08 PM IST
biggboss5ః దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే అంటూ విరుచుకుపడ్డ ఉమాదేవి.. అర్హత లేదంటున్న షణ్ముఖ్‌

సారాంశం

సోమవారం నామినేషన్‌ ప్రక్రియ ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే విడుదలైన రెండు ప్రోమోలు సోమవారం జరిగే నామినేషన్స్ ప్రక్రియ ఎంత హాట్‌ హాట్‌ సాగుతుందో తెలియజేస్తుంది. ఒకరిపై ఒకరు రెచ్చిపోయి ఆరోపణలు చేసుకున్నారు. లోబో, ఉమాదేవి, శ్వేత వర్మ, కాజల్‌ ఇలా తమలోని మరో యాంగిల్‌ని పరిచయం చేశారు. 

బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ రెండో వారం మరింత హీటెక్కుతుందని అర్థమవుతుంది. మొదటి వారం ఎవరి ఈగోలను వారు చూపించారు. ఇష్టారీతిన గేమ్‌ ఆడారు. చాలా వరకు కంటెస్టెంట్లు హౌజ్‌లోనూ డ్రామాలాడుతున్నారనే కామెంట్లు సోషల్‌ మీడియాలో వినిపించాయి. కానీ రెండో వారం నుంచి అసలైన గేమ్‌ స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది. 

సోమవారం నామినేషన్‌ ప్రక్రియ ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే విడుదలైన రెండు ప్రోమోలు సోమవారం జరిగే నామినేషన్స్ ప్రక్రియ ఎంత హాట్‌ హాట్‌ సాగుతుందో తెలియజేస్తుంది. ఒకరిపై ఒకరు రెచ్చిపోయి ఆరోపణలు చేసుకున్నారు. లోబో, ఉమాదేవి, శ్వేత వర్మ, కాజల్‌ ఇలా తమలోని మరో యాంగిల్‌ని పరిచయం చేశారు. లేటెస్ట్ గా విడుదలైన ప్రోమోలో మానస్‌.. లోబోను నామినేట్‌ చేశాడు. దీన్ని సహించలేని లోబో.. నామినేట్‌ చేయడానికి సరైన కారణాలు చెప్పాలన్నారు. `నువ్వు హీరో అనుకుంటున్నావు, వినడానికి కూడా రెడీగా లేవు. యాటిట్యూడ్‌ చూపిస్తున్నావ`ని మండిపడ్డాడు. 

కాజల్‌ వంతు రాగా.. గ్రూప్స్‌లో చాలామంది ఫేక్‌గా ఆడుతున్నారని తెలిపింది. అనంతరం విశ్వను నామినేట్‌ చేసింది. నీ మెచ్యూరిటీ నచ్చిందంటూ శ్రీరామచంద్రను నామినేట్‌ చేశాడు యాంకర్‌ రవి. నటి ప్రియ.. సన్నీ, నటరాజ్‌ మాస్టర్‌లను నామినేట్‌ చేసింది. తర్వాత ఉమాదేవి వంతురాగా.. 'దమ్ము, ధైర్యం, బుద్ధిబలం, సత్తా ఉన్నవాళ్లు నాతో ఆడటానికి ట్రై చేయండి` అని సవాలు విసిరింది. దీంతో చిర్రెత్తిన ప్రియాంక సింగ్‌.. పోవే ఉమా పో.. అంటూ మరోసారి నోరు జారింది. 

మరోవైపు షణ్ముఖ్‌ సైతం ఈ సారి నోరు విప్పాడు. `మీరు ఈ హౌజ్‌కి కరెక్ట్ కాదేమో` అని బాంబ్‌ పేల్చాడు. ఉమాదేవిని ఉద్దేశించి ఆయన ఈ కామెంట్‌ చేసినట్టుంది. అయితే అనీ మాస్టర్‌ కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదిలా ఉంటే రెండో వారం కాజల్‌, లోబో, ఉమాదేవి, ప్రియాంక సింగ్‌, ప్రియా, నటరాజ్‌ మాస్టర్‌, అనీ మాస్టర్‌ నామినేట్‌ అయినట్టు తెలుస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్