ప్రముఖ మలయాళ నటుడు రిజబావా కన్నుమూత

By Aithagoni Raju  |  First Published Sep 13, 2021, 6:54 PM IST

విలన్‌ పాత్రలతో పాపులర్‌ అయిన ప్రముఖ మలయాళ నటుడు రిజబావా కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు.


ప్రముఖ మలయాళ నటుడు రిజబావా(55) కన్నుమూశారు. కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీకి సంబంధించిన చికిత్స తీసుకుంటూ సోమవారం చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 90లో మలయాళంలో విలన్‌ పలు పాత్రలు పోషించి మంచిపేరు సంపాదించారు. 1990లో షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన  `డాక్టర్ పశుపతి` అనే చిత్రంలో రిజాబావా తొలిసారిగా నటించారు. అదే ఏడాది వచ్చిన కామెడీ థ్రిల్లర్‌ `ఇన్ హరిహర్ నగర్‌`లో జాన్ హొనై పాత్ర ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. 

అక్కడ నుండి ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. దాదాపు 150 చిత్రాలలో నటించిన రిజబావా పలు టీవీ సీరియల్స్ లోనూ చేశారు. చివరగా ఆయన మమ్ముట్టి నటించిన `వన్` చిత్రంలో నటించారు. రిజబాబా కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఆయన సినిమాల్లో నటించడం లేదు. తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. రిజబావా మృతిపట్ల నటులు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అక్షయ ప్రేమ్‌నాథ్ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.

Latest Videos

click me!