ముమ్మట్టి తెలుగు కండిషన్స్

By Prashanth MFirst Published Feb 2, 2019, 1:34 PM IST
Highlights

దాదాపు 25 సంవత్సరాల క్రితం స్వాతి కిరణం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి. అయితే ఆ తర్వాత ఆయన ఎన్ని స్ట్రైయిట్ పాత్రలు తెలుగులో వచ్చినా చేయలేదు. మళ్లీ ఇంతకాలానికి ఆయన   ప్రధాన పాత్రలో నటించిన తెలుగు చిత్రం ‘యాత్ర’. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కిన చిత్రమిది. మహి వి.రాఘవ్‌ దర్శకత్వం వహించారు.

విజయ్‌ చిల్లా నిర్మాతగా వ్యవహరించారు. 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన మీడియా  సమావేశంలో మమ్ముట్టి మాట్లాడారు. సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలతో పాటు, తను ఎలాంటి సినిమాలను ఎంచుకుంటారు వంటి విషయాలు  పంచుకున్నారు.

ముమ్మట్టి మాట్లాడుతూ...తను తెలుగు సినిమాలు ఒప్పుకోవాలనుకున్నప్పుడు రెండు కండీషన్స్ మేకర్స్ పెడతానని చెప్పారు. అవేమిటంటే...తను సినిమాలో ప్రధాన పాత్ర అయ్యిండాలి. అలాగే తన పాత్ర పాజిటివ్ గా ఉండాలి. ఈ రెండు ఉండబట్టే యాత్ర సినిమా చేసానని చెప్పారు. 

అలాగే... గత 30 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్‌లో మార్పు కనిపిస్తోంది. విశ్వనాథ్‌గారు భిన్నమైన చిత్రాలు చేశారు. నేను గ్రే షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌ చేశా. తెలుగులో మంచి మసాలా సినిమా చేసే అవకాశం రాలేదు. గతంలో కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో ‘రైల్వేకూలి’ అనే సినిమా అంగీకరించాను. అది పూర్తి కాలేదు.

ఇక అప్పటి ‘స్వాతికిరణం’ సినిమాలో ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను అంటే ఇందుకు కారణం నాకు తెలీదు. దేవుడి దయ అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచిస్తాను. నాది 1980 బ్యాచ్‌ కాదు. 2018 బ్యాచ్‌ అని తేల్చి చెప్పారు. 

click me!