బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లాంచింగ్ డేట్ అధికారికంగా ప్రకటించింది స్టార్ మా. అనుకున్న సమయానికి ముందే క్రేజీ రియాలిటీ షో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం ప్రేక్షకులు వెయిటింగ్. ఇటీవల విడుదలైన ప్రోమోలు ఆసక్తి రేపాయి. హోస్ట్ నాగార్జున ఈసారి ఎంటర్టైన్మెంట్, ఫన్, ట్విస్ట్స్ కి లిమిటే లేదు అంటున్నాడు. ఆయన మాటల వెనుక ఆంతర్యం ఏమిటనేది షో మొదలైతే కానీ తెలియదు. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి అయ్యింది. అలీ తమ్ముడు ఖయ్యూం, జబర్దస్ పవిత్ర, రీతూ చౌదరి, జబర్దస్త్ నరేష్, మై విలేజ్ షో అనిల్ గిల్లా, తేజస్విని గౌడ కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యారట.
అలాగే అంజలి పవన్, వింధ్య విశాఖ, కిరాక్ ఆర్పీ, అమృత ప్రణయ్, కుమారీ ఆంటీ, బర్రెలక్క, బంచిక్ బబ్లు, నటి సోనియా సింగ్, హీరోయిన్ కుషిత కల్లపు కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. కమెడియన్ అభినవ్ గోమఠం సైతం బిగ్ బాస్ 8కి ఎంపిక అయ్యాడంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. లాంచింగ్ ఎపిసోడ్ వరకు కంటెస్టెంట్స్ ఎవరు అనేది సీక్రెట్.
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. ఈ క్రమంలో లేటెస్ట్ సీజన్ పై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచేలా నయా కాన్సెప్ట్స్ తో షోని సిద్ధం చేశారట. ఈసారి కంటెస్టెంట్స్ టైటిల్ కోసం గట్టిగా పోరాడాల్సి ఉంటుందట. గేమ్స్, టాస్క్స్, రూల్స్ కఠినంగా ఉండే సూచనలు కలవు. ఇక సీజన్ 8 కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అందింది.
బిగ్ బాస్ తెలుగు 8 లాంచింగ్ ఎపిసోడ్ కి డేట్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 1న సాయంత్రం 7గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ స్టార్ మా లో ప్రసారం కానుంది. సెప్టెంబర్ 8న ఫస్ట్ ఎపిసోడ్ అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో అనుకున్న సమయానికి ముందే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. స్టార్ హీరోలు గెస్ట్స్ గా రానున్నారని సమాచారం. ఎప్పటిలాగే ఇతర హీరోయిన్స్, కంటెస్టెంట్స్ అదిరిపోయే పెరఫార్మన్స్లు ఇవ్వనున్నారు.
Ee sari Bigg Boss lo entertainment, fun, twists & turns ki LIMIT EH LEDU! Are you ready for LIMITLESS season 8?! THE GRAND LAUNCH coming to you on September 1st at 7 pm! pic.twitter.com/hHC5kOehUs
— Starmaa (@StarMaa)