Guppedantha Manasu Promo: రిషి చనిపోయాడు.. కొత్త హీరో ఎంట్రీ..!

By Ramya Sridhar  |  First Published Feb 5, 2024, 11:41 AM IST

అందుకే ఆయన సడెన్ గా సీరియల్ నుంచి తప్పుకున్నారు. దీంతో.. ఆ ప్లేస్ లో కొత్త వారిని దింపితే ఫ్యాన్స్  జీర్ణించుకోలేరని.. ఏకంగా ఆ క్యారెక్టర్ ని చంపేశారు.


చాలా కాలంగా గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి( ముఖేష్ గౌడ) కనిపించడం లేదు. దీంతో.. ఎప్పుడెప్పుడు మళ్లీ ముఖేష్ గౌడ.. రిషి గా కనిపిస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే.. అదిగో రిషి.. ఇదిగో రిషి.. వచ్చేస్తున్నాడు రిషి.. వారంలో వస్తున్నాడు.. ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడుు అని చెబుతూ..  నెలలుగా ఎపిసోడ్ ల మీద ఎపిసోడ్ లు లాగిస్తూ వస్తుననారు. 

రిషి లేకపోవడంతో ఎపిసోడ్లు చాలా సోదిలా సాగుతుండటం అందరికీ విరక్తి కలుగుతోంది. ఇక.. ఇంతకు మించి లాగలేం అని డైరెక్టర్ కూడా భావించి ఉంటారు. అందుకే.. ఇక.. ఇలా అయితే కష్టమని భావించి.. ఏకంగా రిషి క్యారెక్టర్ ని చంపేశారు. నిజానికి ముఖేష్ గౌడ కి.. సీరియల్ టీమ్ కి మధ్య ఏవే తేడాలు వచ్చినట్లు ఉన్నాయి. అందుకే ఆయన సడెన్ గా సీరియల్ నుంచి తప్పుకున్నారు. దీంతో.. ఆ ప్లేస్ లో కొత్త వారిని దింపితే ఫ్యాన్స్  జీర్ణించుకోలేరని.. ఏకంగా ఆ క్యారెక్టర్ ని చంపేశారు.

Latest Videos

నేడు తాజాగా విడుదల చేసిన  కొత్త ప్రోమో అందుకు నిదర్శనం. ఆ ప్రోమోలో.. మహేంద్ర..హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఆ డెడ్ బాడీ రిషి సర్ ది కాదు కదా అని అడుగుతుంది. కానీ.. అది రిషి డెడ్ బాడీనే అంటూ.. మహేంద్ర ఏడుస్తాడు. ఆ డెడ్ బాడీని వసుధార కూడా చూస్తుంది అనుకుంట.. బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. అంతలో.. రిషి బావ రాజీవ్ వచ్చి మంచినీళ్లు ఇస్తాడు. మనిషిని చూసుకోకుండా వసు వాటర్ అందుకుంటుంది.

తర్వాత రాజీవ్ ని చూసి అసహ్యించుకుంటుంది. రిషి చనిపోయాడు అంట కదా.. నీకు తోడుగా నేనుంటాను.. వెంటనే నాతో తాళి కట్టించుకో అని.. చేతిలో తాళితో గొడవ చేస్తాడు. వసు.. చెంప పగలకొడుతుంది. దీంతో.. రాజీవ్ వసుని ఇబ్బంది పెట్టడానికి రెడీ అవుతాడు. అప్పుడే మరో వ్యక్తి.. ఎంట్రీ ఇస్తాడు. అతనే రిషి ప్లేస్ ని రీప్లేస్ చేస్తాడు కాబోలు. ఫేస్ చూపించలేదు. మరి.. ఈ కొత్త ఎంట్రీని ఫ్యాన్స్  జీర్ణించుకుంటారో లేదో చూడాలి. 
 

click me!