మెగా కోడలు, లావణ్య త్రిపాఠి నటించిన లేటెస్ట్ సిరీస్ ‘Miss Perfect’ రాబోతోంది. తాజాగా బ్యూటీఫుల్ ట్రైలర్ ను విడుదల అయ్యింది. అందమైన క్యారెక్టర్స్ తో సిరీస్ ఆసక్తికరంగా మారింది.
మెగా కోడలు, వరుణ్ తేజ్ Varun Tej భార్య లావణ్య త్రిపాఠి Lavanya Tripathi మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. గతేడాది నవంబర్ 3న వీరి వివాహాం ఇటలీలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ తమ నెక్ట్స్ మూవీస్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి నుంచి బ్యూటీఫుల్ సిరీస్ ఒకటి రాబోతోంది. అదే ‘మిస్ పర్ఫెక్ట్’ Miss Perfect.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందాయి. ఆ మధ్యలో టీజర్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ప్రస్తుతం బ్యూటీఫుల్ టీజర్ విడుదలైంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే లా క్యారెక్టరైజేషన్ ను రూపొందించారు. లావణ్య క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ విషయానికొస్తే.. లావణ్య పరిశుభ్రత పట్ల మక్కువతో పరిపూర్ణత చూపుతోంది. ప్రతిదీ పర్ఫెక్ట్ గా చేయాలని చూస్తుంటుంది. అలాగే బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ కు వంటలు చేయడమంటే చాలా ఇష్టం. దాంతో ప్లాట్ మొత్తం కాస్తా అపరిశుభ్రంగా మారుస్తాడు. ఇలాంటి లక్షణాలు ఉన్నవీరిద్దరూ ఒకే ఫ్లాట్ లో ఉండాల్సి వచ్చినప్పుడు.. ఎదురయ్యే సమస్యలను చూపించబోతున్నారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సిరీస్ పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది.
ఇక లావణ్య త్రిపాఠి అటు సినిమాలు, ఇటు సిరీస్ లు చేస్తూ ఆకట్టుకుంటున్న విషయం చేసింది. ప్రస్తుతం తను ఏ సినిమా చేసినా కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. కొత్తదనం ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటించేందుకు ఒప్పుకుంటోంది. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై బాగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ‘హ్యాపీ బర్త్ డే’ తదితర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింది. చివరిగా ‘పులి మేక’ అనే సిరీస్ లోనూ ఆది సాయికుమార్ తో కలిసి నటించింది.
ప్రస్తుతం తెలుగు వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’ Miss Perfect తో రాబోతోంది. స్కైలాబ్‌కు పేరుగాంచిన విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం నిర్మించారు. ఫిబ్రవరి 2 నుంచి ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. సిరీస్ లో అభిజ్ఞ, ఝాన్సీ, హర్షవర్ధన్, మహేష్ విట్టా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి సౌండ్‌ట్రాక్‌లు అందిస్తున్నారు.