Brahma Mudi Serial Today:అప్పూతో తిరగొద్దని కళ్యాణ్ కి ఆంక్షలు, స్వప్న పై రాహుల్ మరో కుట్ర

Published : Nov 20, 2023, 08:07 AM ISTUpdated : Nov 20, 2023, 09:12 AM IST
Brahma Mudi Serial Today:అప్పూతో తిరగొద్దని కళ్యాణ్ కి ఆంక్షలు, స్వప్న పై రాహుల్ మరో కుట్ర

సారాంశం

ఆ కుటుంబం ఇప్పటికే తమ మీద వేసిన నిందలు నిజమయ్యేవి అని బాధపడతాడు. ఈ విషయం  ఈ ఇంట్లోనే సమాధి అయిపోవాలని కనకానికి చెబుతాడు. కనకం కూడా సరేనని తల ఊపుతుంది.

Brahma Mudi Serial Today: ఈరోజు ఎపిసోడ్ లో కనకం తన భర్తతో అప్పూ ప్రేమ విషయం గురించి నెమ్మదిగా బయటపెడుతుంది. ఇంట్లో మరో సమస్య మొదలైందని చెబుతుంది. సమస్య ఎవరికి అని అతను కంగారుపడతాడు. అప్పుడు నెమ్మదిగా అప్పూ విషయం బయటపెడుతుంది. మనం అప్పూని తనకు నచ్చినట్లుగానే పెంచామని, మనం గుర్తు చేస్తే తప్ప, దానికి అది ఆడపిల్ల అనే విషయమే గుర్తు ఉండేది కాదు. కానీ, ఇప్పుడు అది కూడా ఆడపిల్ల అనే విషయాన్ని గుర్తించింది అని కనకం చెబుతుంది. దానికి ఆమె భర్త మూర్తి, అది మంచి విషయమేగా అని సందేహం వ్యక్తం చేస్తాడు. అయితే అప్పూ, ఓ వ్యక్తిని ప్రేమించిందని  చెబుతుంది. ఎవరిని ప్రేమించిందని అడగగా, కళ్యాణ్ బాబు అని చెబుతుంది. అది విని మూర్తి షాకౌతాడు. 

ఇద్దరూ ప్రేమించుకున్నారా అంటే, తనకు తెలీదని, కానీ, ప్రస్తుతం కళ్యాణ్ కి పెళ్లి కుదిరిందని, అప్పటి నుంచి అప్పూ సరిగా ఉండటం లేదని అసలు విషయం చెప్పేస్తుంది. ఇలా జరిగిందేంటని, ఆ ఇంటి అబ్బాయిని ప్రేమించడం ఏంటి అని మూర్తి చాలా బాధపడతాడు. తానే వెళ్లి అప్పూతో మాట్లాడతాను అని బయలుదేరగా, వద్దు అని కనకం వారిస్తుంది. విషయం మీకు తెలిసిందని తెలిస్తే, అప్పూ ఇంట్లో ఉండదేమో అని కనకం సందేహం వ్యక్తం చేస్తుంది. కానీ, మూర్తి అంగీకరించడు, ఈ విషయం తెలిస్తే, ఆ ఇంట్లోవాళ్లు నానా మాటలు అంటారని గుర్తు చేసుకుంటాడు. అదృష్టం కొద్దీ, కళ్యాణ్ వేరే అమ్మాయిని ప్రేమించాడని, లేకుంటే, ఆ కుటుంబం ఇప్పటికే తమ మీద వేసిన నిందలు నిజమయ్యేవి అని బాధపడతాడు. ఈ విషయం  ఈ ఇంట్లోనే సమాధి అయిపోవాలని కనకానికి చెబుతాడు. కనకం కూడా సరేనని తల ఊపుతుంది.

సీన్ కట్ చేస్తే, రాజ్ ఆఫీసుకు వెళ్లడానికి బయలుదేరతాడు. వెళ్తుంటే, వాళ్ల నానమ్మ ఆపుతుంది. వెంటనే పక్కకు తీసుకువెళ్లి అరుణ్ ఫోటో చూపిస్తుంది. అది చూడగానే, స్వప్నతో మాట్లాడటానికి వచ్చిన విషయం గుర్తుకువస్తుంది రాజ్ కి. ఈ లోగా , వాళ్ల నానమ్మ, స్వప్నతో కలిసి ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయని, వాటిని ఎవరైనా ఇంట్లోవారు చూస్తే, తప్పుగా అనుకుంటారని చింపేశానని చెబుతుంది. స్వప్నని అడిగితే, తనకు తెలీదని అబద్ధం చెప్పిందని కూడా చెబుతుంది. ఈ విషయంలో నిజం ఏంటని? ఈ విషయంలో ఎలాంటి గొడవలు జరగకుండా, సమస్యను పరిష్కరించమని రాజ్ ని అడుగుతుంది. సరే, అని రాజ్ ఆ ఫోటో తీసుకుంటాడు. తాను చెప్పే వరకు  ఈ విషయం ఎవరికీ చప్పొద్దని చెప్పి వెళ్లిపోతాడు.

ఇక, ఈ  ఫోటో తీసుకున్న తర్వాత రాజ్ ఆఫీసుకు వెళ్లకుండా, మళ్లీ గదిలోకి వెళతాడు. లోపల కావ్య రాజ్ ని చూసి.. ఆఫీసుకువెళ్లాలి అని అంత ఫాస్ట్ గా వెళ్లి, మళ్లీ  ఇంత ఫాస్ట్ గా వెనక్కి వచ్చేశారు? నా కోసమేనా అని అడుగుతుంది. దానికి రాజ్ కాదు అని  కాసేపు ఇద్దరూ వాదులాడుకుంటారు. తర్వాత రాజ్ తన దగ్గర ఉన్న అరుణ్ ఫోటోని చూపిస్తాడు. కావ్య షాకౌతుంది. ఇతని ఫోటో రాజ్ దగ్గరకు ఎలా వచ్చిందా అని? అసలు రాత్రి ఇంటికి కూడా వచ్చాడు కదా ఈయన చూసేశారా అని సందేహపడుతుంది.

తర్వాత అతని పేరు రాజ్ అని, వాళ్ల అక్క కాలేజ్ ఫ్రెండ్ అని చెబుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, డాక్టర్ చదివాడని, అంతకు మించి తనకు ఏమీ తెలియదని చెబుతుంది. ఈ విషయాలు ఎందుకు అడుగుతున్నారు అని కావ్య అడగగా, చెప్పను అని రాజ్ వెళ్లిపోతాడు. ఇంతలో కావ్యలో అనుమానాలు మొదలౌతాయి. స్వప్న ఏదైనా దాచి పెడుతుందా అని ఆలోచిస్తుంది.  మరో వైపు రాజ్.. ఈ కళావతి చెప్పింది ఎందుకు నమ్మాలి? తానే స్వయంగా అన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటాడు.

సీన్ కట్ చేస్తే, కళ్యాణ్ అప్పూ ఇంటికి వెళతాడు. పని ఉందని బయటకు వెళదామని రెడీ అవ్వమంటాడు. నాకు వేరే పని ఏమీ లేదా అని అప్పూ చిరాకు పడుతుంది. కానీ, కళ్యాణ్ నీ గురించి నాకు తెలీదా? నిన్ను నేను తప్ప ఇంకెవరు అర్థం చేసుకున్నారు ఇలా అన్ని విషయాలు చెబుతూ ఉంటాడు. ఇన్ని విషయాలు అర్థం చేసుకున్నావ్ కానీ, నా మనసులో ఏముందో మాత్రం తెలుసుకోలేకపోయావ్ అని అప్పూ కూడా మనసులో బాధపడుతుంది. తర్వాత కళ్యాణ్ పెళ్లి పనులు చాలా ఉన్నాయని, త్వరగా రెడీ అయ్యి రమ్మని కోరతాడు.

ఈలోగా, మూర్తి ఈ విషయంలో కలగజేసుకుంటాడు. అప్పూ నీతో రాదు బాబు అని చెబుతాడు. అదేంటి అంకుల్? నాతో అప్పూ రావడం మీకు ఇష్టం లేదా అని కళ్యాణ్ అడుగుతాడు. వెంటనే కనకం కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అప్పూ కాలేజ్ కి వెళ్లక చాలా రోజులు అయ్యిందని, ఈ రోజు వాళ్ల నాన్నతో కలిసి కాలేజ్ కి వెళితే, పరీక్షలు రాయనిస్తారని ఏదో అబద్దం చెబుతుంది. దీంతో కళ్యాణ్, చిన్నపిల్లలా కాలేజ్ బంక్ కొట్టడం ఏంటి అని అడుగుతాడు. నీతో తిరగడానికే కాలేజీ బంక్ కొట్టింది అని మూర్తి షాకిస్తాడు. ఇకపై అలా జరగకూడదనే తాను చెబుతున్నానని చెబుతాడు. కాలేజ్ లేనప్పుడు బయటకు వెళదాం అని కళ్యాణ్ అడుగుతాడు. దానికి మూర్తి ఎలాంటి సమాధానం చెప్పకుండా ఉండిపోగా, కనకం మాత్రం కాలేజ్ లేనప్పుడు తీసుకువెళ్లు అని చెబుతుంది.

ఆ తర్వాత మూర్తి చాలా బాధపడతాడు. ఆరోజు కావ్య తనకు ఈ పెళ్లి వద్దు అని చెప్పినా, బలవంతంగా చేశానని, ఈ రోజు ఈ కూతురు ఇష్టపడ్డానని చెప్పినా పెళ్లి చేయలేకపోతున్నానని బాధపడతాడు. తన చేత కానితనం చూస్తే, తనకే చిరాకు వేస్తోందంటాడు. ఆ మాట విన్నాక, కనకం కూడా బాధగా చూస్తూ ఉండిపోతుంది.

ఇక, కావ్య సీరియస్ గా వెళ్లి స్వప్నను అరుస్తుంది? ఎందుకు అరుస్తున్నావ్? రాజ్ తిట్టాడా  అని అడుగుతుంది. కాదు, అనుమానిస్తున్నాడు అంటుంది. అయితే, అది నీ సమస్య అని స్వప్న కూల్ గా కాఫీ తాగబోతుంటే, నా మీద కాదు, నీ మీద అనుమానం అని కావ్య చెప్పడంతో, స్వప్న షాకౌతుంది. నేనేం తప్పు చేశానని స్వప్న ప్రశ్నించగా, అరుణ్ విషయంలో అబద్ధం చెప్పావ్ ? జస్ట్ మాట్లాడటానికి మాత్రమే వచ్చాడు అనిచెప్పావ్? అందులో నిజం లేదని, రాజ్ ఫోటో తీసుకువచ్చి తనను అరుణ్ గురించి ఆరా తీసిన విషయం కావ్య చెప్పేస్తుంది.

అరుణ్ గురించి రాజ్ కి ఎలా తెలుసు అని కావ్య ప్రశ్నించగా, తనకు ఏమీ తెలియదని స్వప్న నిజం దాస్తుంది. అరుణ్ ఇంటికి ఫోటోలు పంపిన విషయం కావ్యకు చెప్పదు. తనకు ఏమీ తెలియదని అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. కావాలంటే వెళ్లి, రాజ్ ని అడుగమని, తనకు ఏం సంబంధం లేదని చెబుతుంది. అరుణ్ కీ, తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతుంది. ఇవన్నీ, రాహుల్ వినేస్తాడు. కావ్య ఆలోచనలో పడుతుంది. స్వప్న అంత కాన్ఫిడెంట్ గా ఉందంటే, ఏ తప్పు చేయడం లేదులే అని అనుకుంటుంది.  రాహుల్ మాత్రం మరో కుట్ర చేయడానికి ప్లాన్ చేస్తాడు. అరుణ్ ని ఇంటిదాకా తీసుకువచ్చినా కూడా స్వప్న బయపడలేదంటే, ఇంకా ఏదైనా చేయాలని అనుకుంటూ ఉంటాడు. వెంటనే అరుణ్ కి కాల్ చేస్తాడు. స్వప్న కు ఫోన్ చేసి డబ్బులు అడగమని రాహుల్ చెబుతాడు. సరే అని ఫోన్ పెట్టేస్తాడు అరుణ్.

మరోవైపు, అతను ఎవరు? ఎలా తెలుసుకోవాలి? స్వప్న ఏదైనా తప్పు చేస్తుందా అని రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత అరుణ్ గురించి ఆరాతీసే పనిలో పడతాడు. ఓ పోలీస్ అధికారికి ఫోన్ చేసి అరుణ్ గురించి తనకు పూర్తి వివరాలు తెలుసుకోమని చెబుతాడు.సాయంత్రం లోగా అన్ని విషయాలు చెబుతానని ఆ పోలీస్ చెబుతాడు. ఇక, కమింగ్ అప్ లో ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశిస్తాడు, రాజ్, కావ్యలను తాళ్లతో కట్టేస్తాడు. మెళకువ వచ్చి చూసేసరికి, కట్టేసి ఉండటంతో ఇద్దరూ షాకైతారు. ఏదో కామెడీ ట్రాక్ కమింగ్ ఎపిసోడ్ లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 10 ఎపిసోడ్ : డబ్బులు ఇస్తూ బుద్ధి బయటపెట్టిన మనోజ్, వద్దని షాకిచ్చిన బాలు..!
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!