నాలుగవ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. కంటెస్టెంట్స్ గట్టిగానే వాదులాడుకున్నారు. తగు కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు.

07:54 AM (IST) Sep 25
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో నాలుగోవారం సోనియా డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఆట తీరు.. ఇతరులపై నోరు జారడం.. పృధ్వీ, నిఖిల్ లను చేతులో పెట్టుకుని.. వారి గేమ్ ను నాశనం చేయడం లాంటి కారణాలు ఆడియన్స్ కు చిరాకు తెప్పిస్తున్నాయి. దాంతో సోనియాకు వ్యతిరేకంగా ఓట్లు పోల్ అవుతున్నట్టు తెలుస్తోంది. కాని బిగ్ బాస్ ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో ఈ వారం సోనియా పక్కగా హౌస్ ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
06:32 AM (IST) Sep 25
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో.. వరస్ట్ గేమ్ ఆడుతున్న వాళ్ళలో సోనియా ముందు ఉంది. అటు పృధ్వీని.. ఇటు నిఖిల్ ను తన చెప్పుచేతల్లో పెట్టుకుని.. ఆడిస్తుంది సోనియా. ఈ విషయం అటు హౌస్ లో ఉన్నవారికి.. ఇటు ఆడియన్స్ కు బాగా అర్ధం అవుతుంది. దాంతో నిఖిల్, పృధ్వి ఇద్దరికి దద్దోజనం అని పేరు పెట్టింది విష్ణు ప్రియ. ఆమె చుట్టు తిరుగుతూ.. వారి గేమ్ వారు ఆడుకోలేకపోతున్నారంటూ మండిపడింది.
06:26 AM (IST) Sep 25
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. ప్రతీ వీక్ కు ఇంట్రెస్టింగ్ కంటెంట్ పెరిగిపోతోంది. ఇక కంటెస్టెంట్లు ఉక్కిరి బిక్కిరి అయ్యే టాస్క్ లతో బిగ్ బాస్ ఏమాత్రం ఖాళీగా ఉంచడం లేదు. ఇక తాజా ఎపిసోడ్ లో కాంతార టీమ్ కు కొత్త చీఫ్ గా కిర్రాక్ సీత ఎంపికయ్యింది. అభయ్ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోవడంతో.. ఆ క్లాన్ కు కొత్త ఛీఫ్ కోసం పోటీ పెట్టగా.. అందులో ఎంతో కఫ్టం మీద సీత విన్ అయ్యింది.
బిగ్ బాస్ లో చీఫ్ పాలిటిక్స్, సోనియాకు ఇచ్చిపడేసిన యష్మి...దద్దోజనంలా మారిన పృధ్వి,
03:34 PM (IST) Sep 24
కాంతార క్లాన్ కి చీఫ్ అయ్యేది నిర్ణయించే బాధ్యత కంటెస్టెంట్స్ కి ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ సైతం మనస్పర్థలకు దారి తీసింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఆసక్తి రేపుతోంది.
12:57 PM (IST) Sep 24
నామినేషన్స్ ముగిసినా హౌస్లో హీట్ తగ్గలేదు. యష్మి-సోనియా మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అమ్మ,సిస్టర్ అంటూ వాడిని(పృథ్విరాజ్) ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నావని నాకు అనిపిస్తుంది... అంటూ సోనియా మీద యష్మి ఆరోపణలు చేసింది.
11:51 AM (IST) Sep 24
నామినేషన్స్ లో నబీల్ అఫ్రిది- సోనియా మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలో సోనియా కామెంట్స్ కి నబీల్ బ్రదర్ కౌంటర్ ఇచ్చాడు. నిన్ను చూస్తుంటే నాకు మా కాలేజ్ వార్డెన్ గుర్తుకు వస్తున్నాడు. అక్కడ పని చేస్తావా? నెలకు పది వేలు ఇప్పిస్తా అంటూ... నవీల్ బ్రదర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
07:16 AM (IST) Sep 24
సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ కి రికార్డు స్థాయి రేటింగ్ వచ్చింది. 18.9 రేటింగ్ రాబట్టింది. ఇది బిగ్ బాస్ తెలుగు హైయెస్ట్ రేటింగ్ అని సమాచారం. అయితే వీక్ డేస్ లో రేటింగ్ పడిపోయింది. సెకండ్ వీకెండ్ ఇది మరింత క్రిందకు పడిపోయిందట.
వీకెండ్ 5.55 రేటింగ్ రాబట్టగా, వీక్ డేస్ లో ఇది 4.09 గా ఉన్నట్లు సమాచారం. కాకపోతే అర్బన్ ఏరియాల్లో కొంత మెరుగైన రేటింగ్ బిగ్ బాస్ తెలుగు 8 రాబట్టింది. రెండో వారానికి అర్బన్ ఏరియాల్లో వీకెండ్ 7.01, వీక్ డేస్ లో 4.92 రేటింగ్ వచ్చిందట. .
06:31 AM (IST) Sep 24
నాలుగవ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. కంటెస్టెంట్స్ గట్టిగానే వాదులాడుకున్నారు. తగు కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. అనంతరం ప్రేరణ, సోనియా, నబీల్, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, పృథ్విరాజ్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు.