ప్రియుడు నగ్నంగా వీడియో తీసి డబ్బుల కోసం వేధిస్తున్నాడుః నటి జెన్నిఫర్‌ ఫిర్యాదు

Published : Apr 25, 2021, 08:49 AM IST
ప్రియుడు నగ్నంగా వీడియో తీసి డబ్బుల కోసం వేధిస్తున్నాడుః నటి జెన్నిఫర్‌ ఫిర్యాదు

సారాంశం

ప్రియుడు తనని నగ్నంగా వీడియో తీసి డబ్బుల కోసం వేధిస్తున్నాడని నటి జెన్నిఫర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళ సీరియల్స్ లో నటించే జెన్నిఫర్‌ శుక్రవారం చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ప్రియుడిపై కంప్లెయింట్‌ చేసింది. 

ప్రియుడు తనని నగ్నంగా వీడియో తీసి డబ్బుల కోసం వేధిస్తున్నాడని నటి జెన్నిఫర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళ సీరియల్స్ లో నటించే జెన్నిఫర్‌ శుక్రవారం చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ప్రియుడిపై కంప్లెయింట్‌ చేసింది. ఇందులో ఆమె చెబుతూ, `నేను ఐదేళ్లుగా తమిళ టీవీ సీరియల్స్ లో నటిస్తున్నాను. మనాలి సమీపంలోని చిన్న సేక్కాడు ప్రాంతంలో నా ఫ్యామిలీతో కలిసి  ఉంటున్నా. స్థానిక ఎంజీఆర్‌ నగర్‌ కి చెందిన శరవణన్‌ అనే వ్యక్తిని గత 2019 ఆగస్ట్ 25న వివాహం చేసుకున్నాను. మా మధ్య మనస్పర్థాలు రావడంతో విడిపోయాం. ఇప్పుడు ఆ కేసు కోర్ట్ లో ఉంది. 

అయితే అనంతరం నేను టీవీ సీరియల్‌ సహాయ దర్శకుడు నవీన్‌ కుమార్‌ తో సహజీవనం చేశాను. ఈ క్రమంలో నవీన్‌ జాబ్‌ పోయింది. దీంతో తన ఖర్చుల కోసం నన్ను వేధించసాగాడు. డబ్బులు ఇవ్వనని చెప్పడంతో షూటింగ్‌ స్పాట్‌కి వచ్చి, బలవంతంగా కారులోకి లాక్కెల్లి నగ్నంగ్‌ వీడియో తీశాడు. దీనిపై అతని తల్లికి చెప్పగా, ఆమె తన కొడుకు చెప్పినట్టు నడుచుకోవాలని బెదిరించారు. దీంతో నవీన్‌ కుమార్‌ పై ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపింది జెన్నిఫర్‌.  

నవీన్‌ తీసిన వీడియోని తనకి ఇప్పించాలని, తనపై దైర్జన్యాలకు పాల్పడిన అతడు, అతని పేరెంట్స్ పై చర్యలు తీసుకోవాలని 24ఏళ్ల నటి జెన్నిఫర్‌ వెల్లడించారు.`సెంబరుతి` షోలో ఉమాగా గుర్తింపు తెచ్చుకున్న జెన్నిఫర్‌ ప్రస్తుతం `వనతై పోలా` అనే షోలో నటిస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు