పెళ్లి పీటలెక్కిన ప్రముఖ టీవీ నటి!

Published : Jul 08, 2019, 09:37 AM IST
పెళ్లి పీటలెక్కిన ప్రముఖ టీవీ నటి!

సారాంశం

ప్రముఖ టీవీ నటి అస్మిత వివాహం చేసుకొంది. కొరియోగ్రాఫర్ సుధీర్ తో ఆమె వివాహం జరిగింది. 

ప్రముఖ టీవీ నటి అస్మిత వివాహం చేసుకొంది. కొరియోగ్రాఫర్ సుధీర్ తో ఆమె వివాహం జరిగింది. చాలా కాలంగా వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. గతంలో అస్మిత ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

అయితే ఇటీవల ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది. శనివారం రోజుల వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు టీవీ నటులు, యాంకర్లు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు వ్యక్తులు హాజరయి వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను. వీడియోలను పలువురు నటీమణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అస్మిత కెరీర్ విషయానికొస్తే.. 'పద్మవ్యూహం', 'మేఘసందేశం', 'మనసు మమత' ఇలా చాలా సీరియళ్లలో నటిస్తోంది. గతంలో ఒకట్రెండు సినిమాల్లో కూడా నటించింది. 

PREV
click me!

Recommended Stories

Jana Nayakudu మూవీ `భగవంత్‌ కేసరి`కి కాపీనా, రీమేకా? అసలు నిజం చెప్పిన నిర్మాత.. ట్రోల్స్ కి ఫుల్‌ స్టాప్‌
Tamannaah Bhatia: కేవలం 6 నిమిషాల్లో 6కోట్లు సంపాదించిన మిల్కీ బ్యూటీ..!