రౌడీ హీరో ఎమోషనల్ స్పీచ్.. ఫ్యాన్స్ షాక్!

Published : Jul 08, 2019, 08:24 AM IST
రౌడీ హీరో ఎమోషనల్ స్పీచ్.. ఫ్యాన్స్ షాక్!

సారాంశం

  విజయ్ దేవరకొండ స్టేజ్ పై ఉంటే ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అభిమానులు విజయ్ మాటలు వింటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ మొదటిసారి ఈ రౌడీ హీరో స్టేజ్ పై కన్నీరు పెట్టుకున్నాడు

విజయ్ దేవరకొండ స్టేజ్ పై ఉంటే ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అభిమానులు విజయ్ మాటలు వింటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ మొదటిసారి ఈ రౌడీ హీరో స్టేజ్ పై కన్నీరు పెట్టుకున్నాడు. తమ్ముడు తన ఫ్యామిలీ కోసం ఎంతో చేశాడని కానీ మొదటిసారి వాడు పడుతున్న కష్టానికి తాను కొంత కూడా హెల్ప్ చేయలేకపోయానని భావోద్వేగానికి లోనయ్యాడు. 

రీసెంట్ గా దొరసాని చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించింది. అయితే ఈవెంట్ కి ముఖ్య అతిధిగా వచ్చిన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో తనకున్న ఎమోషనల్ బాండ్ గురించి వివరించాడు. యూఎస్ లో జాబ్ చేస్తూ స్ట్రగుల్ అవుతున్న సమయంలో ఎంతో హెల్ప్ చేశాడని అయితే తన సినిమాకు నేనెప్పుడూ హెల్ప్ చేయలేదని అన్నాడు. 

సినిమా లాంచ్ కి వెళ్ళలేదు.. ఒక సాంగ్స్ పై రెస్పాండ్ అవ్వలేదు.. టీజర్ కూడా షేర్ చేసుకోలేకపోయా.. ఎందుకంటే తన తమ్ముడు కెరీర్ మొదట్లోనే తన సొంతంగా ఎదగాలని అందుకే ఏ విధమైన హెల్ప్ చేయలేకపోయా అని కన్నీరు పెట్టుకున్నాడు, ఈ యాంగిల్ లో విజయ్ ని చూసిన ఆడియెన్స్ సైలెంట్ అయిపోయారు. సినిమా రీసెంట్ గా చూశానని అద్భుతంగా వచ్చిందని తప్పకుండా అందరికి నచ్చుతుందని విజయ్ వివరణ ఇచ్చాడు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా