Alia Bhatt :మీ సినిమా కోసం మా అమ్మని వేశ్యగా మారుస్తారా..? కొడుకు ఫైర్

Surya Prakash   | Asianet News
Published : Feb 17, 2022, 06:08 AM IST
Alia Bhatt :మీ సినిమా కోసం మా అమ్మని వేశ్యగా  మారుస్తారా..? కొడుకు ఫైర్

సారాంశం

“నా తల్లిని వేశ్యగా మార్చారు.ఇప్పుడు  అనేకమంది అమ్మ అసలు వేశ్యనా లేదా సోషల్ వర్కర్ నా అంటూ అవమానిస్తున్నారు. ఇలాంటి మాటలు మమ్మల్ని బాధిస్తున్నాయి. మా అందరి మానసిక స్థితి బాగాలేదు.


 బాలీవుడ్‌ బ్యూటీ ఆలియాభట్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయ్‌ కతియావాడీ’. ముంబయి మాఫియా క్వీన్‌ గంగూబాయ్‌ జీవితచరిత్ర ఆధారంగా దీన్ని రూపొందించారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా కోసం  హిందీ సినీ  ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించించారు.

అయితే  గంగూబాయి కుటుంబం మాత్రం సినిమా రిలీజ్ కు ఇష్టపడటం లేదు. ఆమె కుమారుడు సినిమాపై ఫైర్ అయ్యాడు. గంగూబాయి కుటుంబం, ఆమె దత్తపుత్రుడు బాబు రావుజీ షా, ఆమె మనవరాలు భారతి ఈ చిత్రం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. నేషనల్ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఆందోళనను వెల్లడించారు.మరికొన్ని రోజుల్లో సినిమా విడుదల కానుండగా..  ఆమె కుమారుడు మాట్లాడుతూ సినిమాపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

“నా తల్లిని వేశ్యగా మార్చారు.ఇప్పుడు  అనేకమంది అమ్మ అసలు వేశ్యనా లేదా సోషల్ వర్కర్ నా అంటూ అవమానిస్తున్నారు. ఇలాంటి మాటలు మమ్మల్ని బాధిస్తున్నాయి. మా అందరి మానసిక స్థితి బాగాలేదు. అమ్మగురించి అలాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం.’’ అన్నారు

గంగూబాయిపై సినిమా రూపొందుతోందని వార్తలు వచ్చినప్పటి నుంచే ఆమె కుటుంబం అజ్ఞాతంలో ఉందని, తరచుగా ఇళ్లు మారుతోందని గంగూబాయి కుటుంబం తరఫు న్యాయవాది నరేంద్ర వెల్లడించారు. గంగూబాయి మనవరాలు భారతి కూడా మేకర్స్‌పై విరుచుకుపడింది. డబ్బు కోసం దురాశతో కుటుంబం పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

“డబ్బుపై దురాశతో ఈ సినిమా మేకర్స్‌ అంతా నా కుటుంబం పరువు తీశారు. దాన్ని ఎట్టిపరిస్థితిలోనూ అంగీకరించలేం. ప్రాజెక్ట్‌తో ముందుకు సాగడానికి ముందు మీరు మా కుటుంబం అనుమతి అడగలేదు. మీరు పుస్తకం రాసేటప్పుడు మా దగ్గరికీ రాలేదు. సినిమా తీయడానికి ముందు మా అనుమతి తీసుకోండి. నా అమ్మమ్మ తన జీవితాంతం అక్కడ సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేసింది. కానీ ఈ వ్యక్తులు మా అమ్మమ్మను అభ్యంతరకరంగా చూపిస్తున్నారు? ” అంటూ ప్రశ్నించారు.

గత ఏడాది  ‘గంగూబాయి కతియావాడీ’ చిత్రంపై బాబూ రావుజీ షా పిటిషన్ దాఖలు చేయడంతో ముంబయి కోర్టు సంజయ్ లీలా భన్సాలీ, అలియా భట్‌లకు సమన్లు ​జారీ చేసింది. ఆ తర్వాత  సినిమా విడుదలపై స్టే విధించేందుకు ముంబయి హైకోర్టు నిరాకరించింది. అంతే కాదు చిత్ర నిర్మాతలపై క్రిమినల్, పరువు నష్టం కేసులపై మధ్యంతర స్టే కూడా ఇచ్చింది. ఇప్పుడు కేసు పెండింగ్‌లో ఉంది.

ముంబైలోని 'కామాటిపుర' నేపథ్యంలో బాలీవుడ్ లో  గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. ఆ క్రమంలోనే  ఇప్పుడు 'గంగూబాయి కతియవాడి' సినిమా రూపొందింది. అయితే ఆ సినిమాలకు దీనికి తేడా ఏంటంటే..ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలీ  దర్శకత్వం వహించటం. జయంతిలాల్ గడ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో టైటిల్ రోల్ ను అలియా భట్ పోషించింది.
 
కామాటిపుర అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో ఉండే ఒక సాధారణ అమ్మాయి గంగూబాయిగా.. ఒక రాజకీయ నాయకురాలిగా ఎదగడం వరకు చేసిన పోరాటాన్ని, ఆమె ప్రయాణంగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అలియా భట్.. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి వస్తున్నామని తెలియజేసింది.

ఈ మూవీలో అలియా భట్‌తో పాటు విజయ్ రాజ్, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటించారు. అజయ్ దేవగన్ కూడా మూవీలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్‌లో అజయ్ కొన్ని సెకన్ల పాటు మాత్రమే కనిపించినప్పటికీ ఆయన పాత్ర కీలకమని అర్థమవుతోంది. ఎస్. హుస్సేన్ జైదీ ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’ని తెరకెక్కించారు. నిజజీవితంలో గంగూబాయి సెక్స్ వర్కర్లతోపాటు అనాథల బాగు కోసం తీవ్రంగా కృషి చేశారని చెబుతుంటారు.

'గంగూబాయి కతియావాడి' తెలుగు లోనూ  విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ సైతం తెలుగులో రిలిజ్ చేశారు చిత్ర బృందం.  ఆలియా భట్ మాట్లాడుతూ 'అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న  'గంగూబాయి కతియావాడి' తెలుగులోనూ టీజర్ విడుదల కావడం గౌరవంగా భావిస్తున్నాను' అంటూ తెలిపారు.  ఈ టీజర్‌కి అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.  
 

 

PREV
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద