`సన్నాఫ్‌ ఇండియా` ఓటీటీ చిత్రమట.. మోహన్‌బాబుతోనే ప్రయోగాలా?.. షాకింగ్‌ విషయాలు వెల్లడించిన దర్శకుడు

Published : Feb 16, 2022, 11:21 PM IST
`సన్నాఫ్‌ ఇండియా` ఓటీటీ చిత్రమట.. మోహన్‌బాబుతోనే ప్రయోగాలా?.. షాకింగ్‌ విషయాలు వెల్లడించిన దర్శకుడు

సారాంశం

మోహన్‌బాబుతో `సన్నాఫ్‌ ఇండియా` చిత్రంతో ఫస్ట్ టైమ్ తెలుగులో ఓ సరికొత్త ప్రయోగం చేశామని అంటున్నారు `సన్నాఫ్‌ ఇండియా` చిత్ర దర్శకుడు డైమండ్‌ రత్నబాబు.  

కలెక్షన్ కింగ్‌ మోహన్‌బాబుతో ప్రయోగం చేశారట. `సన్నాఫ్‌ ఇండియా` చిత్రంతో ఫస్ట్ టైమ్ తెలుగులో ఓ సరికొత్త ప్రయోగం చేశామని అంటున్నారు `సన్నాఫ్‌ ఇండియా` చిత్ర దర్శకుడు డైమండ్‌ రత్నబాబు.  మోహన్‌బాబు హీరోగా, డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం `సన్నాఫ్‌ ఇండియా`. శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మించాయి. దేశ భక్తి నేపథ్యంలో చాలా గ్రాండ్‌గా రూపొందిన ఈ సినిమాను ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం.. సినిమా గురించి, మోహన్‌బాబు గురించి, కరోనా సమయంలో జరిగిన సంఘటనల గురించి దర్శకుడు రత్నబాబు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 

ఆయన మాట్లాడుతూ, నాలుగు ఫైట్లు, ఐదు సాంగ్స్ కలిగిన క‌మ‌ర్షియ‌ల్ ప్యాకేజ్ చిత్రంకాదిది.  ఓ ప్ర‌యోగాత్మ‌కంగా రూపొందించాం. ఎందుకంటే క‌రోనా స‌మ‌యంలో అంద‌రూ ఎక్కువ‌గా రైతుల‌ను పొగిడారు. క‌రోనా స‌మ‌యంలో మ‌నంద‌రం ఇంకా బ్ర‌తికి ఉన్నాం అంటే దానికి కార‌ణం రైత‌న్న‌లే. అలాగే క‌రోనా స‌మ‌యంలో వైధ్యుల‌ను పొగిడారు. మ‌నం బ్ర‌తికి ఉండ‌డానికి కార‌ణం వైధ్యులే అన్నారు. కానీ మ‌న సినిమా వాళ్ళు కూడా  గొప్ప‌వాళ్లని నేను నమ్ముతాను. ఎందుకంటే క‌రోనా స‌మ‌యంలో లాక్‌డౌన్ పెట్టేసి ప్ర‌తి ఒక్క‌రిని ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు. జనం యూట్యూబ్‌లో కానీ, ఓటీటీలోగానీ, ఎంట‌ర్‌టైన్ అవుతూ వారు లైఫ్‌ని లీడ్ చేశారు. క‌రోనా స‌మ‌యంలో డాక్ట‌ర్ల‌తో పాటు సినిమా వాళ్ళు కూడా గొప్ప‌వార‌ని నాకు అనిపించింది.

కాబ‌ట్టి క‌రోనా స‌మ‌యంలో నేను మోహ‌న్‌బాబుగారిని క‌ల‌వ‌డం సార్ ఒక చిన్న ప్ర‌యోగం చేద్దాం అని నేను అడ‌గ‌డం జ‌రిగింది. గ‌తంలో నాకు ఫ్లాప్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న నాకు అవ‌కాశం ఇవ్వ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ మాట‌ల సంద‌ర్భంలో ఆయ‌న‌కు నేను స‌న్ ఆఫ్ ఇండియా క‌థ చెప్ప‌డం అది ఆయ‌న ఓకే చెయ్య‌డం జ‌రిగింది. ఓటీటీ కోస‌మ‌ని ప్లాన్ చేసి ఒన్ అండ్ ఆఫ్ అవ‌ర్ ప్లాన్ చేశాం. కానీ సినిమా వ‌చ్చిన త‌ర్వాత థియేట‌ర్ల‌ను ప్రేమించే వ్య‌క్తిగా మోహ‌న్‌బాబుగారు నాకు థియేట‌ర్లంటే ఇష్టం ఓటీటీ మ‌ధ్య రిలీజ్ చెయ్య‌డం ఎందుకో అంత‌గా నాకు న‌చ్చ‌దు అన్నారు. 

ఇందులో అద్భుత‌మైన డైలాగులు ఉన్నాయి. ఈ సినిమా ఎలాగైనా థియేట‌ర్లో రావాల‌ని అన్నారు. ఇక క్లైమాక్స్‌లో పుణ్య‌భూమినాదేశం, రాయ‌ల‌సీమ‌రామ‌న్న‌చౌద‌రి లాంటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగులు ఈ సినిమాలో ఉంటాయి. మోహ‌న్‌బాబు పాత్ర‌కి చిరంజీవిగారు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇళ‌య‌రాజా లాంటి గొప్ప లెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఈ సినిమాకి ప‌ని చేయ‌డం నాకు సంతోషంగా ఉంది. ఈ సినిమా నిడివి కేవ‌లం ఒక గంట 30 నిమిషాలు మాత్ర‌మే. ఇదొక స‌రికొత్త ప్ర‌యోగం. ఇలాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని మోహ‌న్‌బాబుగారు ఎంక‌రేజ్ చేశారు.

ప్రైవేట్ ఆసుప‌త్రులు, ప్రైవేట్ స్కూళ్ళ త‌ర‌హాలో ఈ చిత్రంలోని హీరో ప్రైవేట్ జైలుని న‌డ‌ప‌డం విశేషం. అయితే ట్రైల‌ర్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. క్లీన‌ర్లు రేప్ చేస్తే ఎన్‌కౌంట‌ర్ చేస్తారు. మ‌రి రాజ‌కీయ‌నాయ‌కులు చేస్తే కేసులు ఉండ‌వా వంటి డైలాగులు ఈ చిత్రంలో చాలానే ఉంటాయి. అందులో ఎటువంటి వివాదం వ‌చ్చినా మోహ‌న‌బాబుగారు చూసుకుంటార‌నే ధ్యైర్యం నాకు ఉంది. ఈ చిత్రం ల‌క్ష్మీప్ర‌స‌న్న బ్యాన‌ర్‌స్థాయిని  పెంచేది అని చెప్ప‌ను కాని త‌గ్గించే చిత్ర‌మైతే అవ్వ‌దు. నేను కూడా ఈ సినిమా ప‌రీక్ష‌లు రాసి రిజ‌ల్ట్ కోసం ఎదురు చూసే స్టూడెంట్‌లాగా ఎదురు చూస్తున్నాను. 

అలాగే ఈ చిత్రంలో ర‌ఘువీర గ‌ద్యం హైలెట్ కానుంది. ఈ చిత్రంలో మోహ‌న్‌బాబు పాత్ర పేరు విరుపాక్ష‌. అలా అని దేశ‌భ‌క్తి చిత్రం కాదు. న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఉన్న లొసుగులు గురించి ప్ర‌శ్నించే విధంగా విరూపాక్ష పాత్ర ఉంటుంది. ఇది అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునే చిత్ర‌మిది. ఈ చిత్రం బిగినింగ్ ఎవ్వ‌రూ కూడా మిస్ అవ్వొద్దు. త్వ‌ర‌లో మోహ‌న్‌బాబు, మంచుల‌క్ష్మీ క‌లిసి న‌టించే ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నా` అని తెలిపారు దర్శకుడు డైమండ్‌ రత్నబాబు. మరి మోహన్‌బాబుతో దర్శకుడు చేసిన ప్రయోగం ఫలించేనా అన్నది వేచి చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద