అమీర్‌ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. టర్కీలో ఫాలోయింగ్‌ మామూలుగా లేదుగా!

Published : Aug 13, 2020, 09:14 AM IST
అమీర్‌ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. టర్కీలో ఫాలోయింగ్‌ మామూలుగా లేదుగా!

సారాంశం

`థగ్స్ ఆఫ్‌ హిందూస్థాన్‌` చిత్రం పరాజయం తర్వాత చాలా సెలక్టీవ్‌గా ఓ రీమేక్‌ సినిమాని ఎంచుకున్నారు అమీర్‌. హాలీవుడ్‌ చిత్రం `ఫారెస్ట్ గంప్‌`ని `లాల్‌ సింగ్‌ చద్దా`గా బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్‌ మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. 

మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌కి మన ఇండియాలోనే కాదు అంతర్జాతీయంగా కూడా భారీ క్రేజ్‌ ఉంది. ఆయన నటించిన `దంగల్‌` చిత్రం చైనా రికార్డ్ బ్రేకింగ్‌ కలెక్షన్లని రాబట్టింది. సింగపూర్‌, జపాన్‌, అమెరికా వంటి దేశాల్లో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా టర్కీలో కూడా అమీర్‌ ఖాన్‌ కోసం అభిమానులు ఎగబడ్డారు. ఫోటోలు దించుకునేందుకు తోసుకుంటూ వెళ్ళారు. దీంతో అక్కడ ఆయనకున్న ఫాలోయింగ్‌ ఏంటో అర్థమవుతుంది. 

`థగ్స్ ఆఫ్‌ హిందూస్థాన్‌` చిత్రం పరాజయం తర్వాత చాలా సెలక్టీవ్‌గా ఓ రీమేక్‌ సినిమాని ఎంచుకున్నారు అమీర్‌. హాలీవుడ్‌ చిత్రం `ఫారెస్ట్ గంప్‌`ని `లాల్‌ సింగ్‌ చద్దా`గా బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్‌ మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మోనా సింగ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌, వయాకామ్‌18 మోషన్‌ పిక్చర్స్  సంయుక్తంగా దీన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల కరీనా మరోసారి తల్లి కాబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈ చిత్రంలో నటిస్తుందా? లేదా? అన్నది సస్పెన్స్ నెలకొంది.

కరోనా లాక్‌ డౌన్‌ వల్ల ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల మళ్లీ షూటింగ్‌లు ప్రారంభించారు. అందులో భాగంగా ఇది ఇప్పుడు టర్కీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్కడికి చేరుకున్న అమీర్‌ని చూసి టర్కీ అభిమానులు ఎగబడ్డారు. ఆయన్ని విష్‌ చేసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు వందల మంది అభిమానులు గుమిగూడారు. కాసేపు ఆయన వారికి సెల్ఫీలు ఇచ్చి, ఆ తర్వాత కారులో లొకేషన్‌కి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలను అభిమానులు సోషల్‌ మీడియాల మాధ్యమాలైనా ట్విట్టర్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌లలో షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హడావుడి చేస్తున్నాయి. ఇందులో అమీర్‌ కళ్లజోడు పెట్టుకుని, మాస్క్ ధరించి ఉన్నారు. టర్కీలో కూడా తనకున్న ఫాలోయింగ్‌ని చాటుకుని ఇంటర్నేషనల్‌ స్టార్‌ అనిపించుకున్నారు అమీర్‌.

ఇదిలా ఉంటే లాక్‌ డౌన్‌ ఎత్తేసిన తర్వాత, సడలింపులు ఇచ్చాక విదేశాల్లో షూటింగ్‌ జరుపుకుంటున్న రెండో భారతీయ చిత్రం `లాల్‌ సింగ్‌ చద్దా` కావడం విశేషం. అంతకు ముందే అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న `బెల్‌ బాటమ్‌` చిత్రాన్ని లండన్‌లో షూటింగ్‌ స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే `లాల్‌ సింగ్‌ చద్దా`ని మొదట ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ లాక్‌ డౌన్‌ వల్ల దాన్ని వాయిదా వేశారు. ఇప్పడు వచ్చే ఏడాది క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి