Intinti Gruhalakshmi: సంజయ్ నిజస్వరూపం తెలుసుకున్న దివ్య..లాస్యకు బుద్ధి చెప్పిన తులసి?

Published : Mar 10, 2023, 08:50 AM IST
Intinti Gruhalakshmi: సంజయ్ నిజస్వరూపం తెలుసుకున్న దివ్య..లాస్యకు బుద్ధి చెప్పిన తులసి?

సారాంశం

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 10వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్ లో అనసూయ తులసి నాకు ఇష్టమైన గుమ్మడికాయ కూర చేస్తోంది ఇలా ఎక్సైజ్ చేస్తే నాలుగు ముద్దలు ఎక్కువ తినవచ్చని ఇలా చేస్తున్నాను అనడంతో పరంధామయ్య నవ్వుకుంటూ ఉంటాడు. వారిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండగా లాస్య నందుని అక్కడికి వెళ్ళు వెళ్ళు అని బలవంతంగా అక్కడికి పంపిస్తుంది. అప్పుడు నందు అక్కడికి వెళ్లి సిగ్గుపడుతూ మాట్లాడడానికి భయపడుతూ ఉంటాడు. అసలు విషయం చెప్పడానికి గుటకలు మింగుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు నందు. అప్పుడు తులసి అక్కడికి కాఫీ తీసుకుని రావడంతో అమ్మా నందు ఏదో చెప్పాలనుకుంటున్నాడు నువ్వు కూడా కూర్చో కాస్త ధైర్యంగా పడతాడు అనగా అప్పుడు తులసి కూర్చోవడంతో నందు పైకి లేచి నిలబడతాడు.

అప్పుడు నందు పేస్ అంతా ఒకలాగా పెట్టడంతో తులసి నందుని అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు నందు ఎలాగో అలా చెప్పేయాలి అని అనసూయ పరందామయ్య దంపతులకు ఈరోజు మా ఫ్రెండ్ వాసుదేవ్ నుంచి వస్తున్నాడు అంటూ అసలు విషయాలు చెబుతూ సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు లాస్య ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. నందు అసలు విషయం చెప్పడంతో పరంధామయ్య అనసూయ ఇద్దరు కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడు పరంధామయ్య సీరియస్ అవుతూ ఏరా నీ కంటికి ఎలా కనిపిస్తున్నాము ఏ ముఖం పెట్టుకొని మేము తులసిని అడగాలి అనడంతో ఇంతలోనే అనసూయ అసలు ఈ దరిద్రపుగొట్టు ఆలోచన నీ మనసుకి ఎలా తట్టింది అని సీరియస్ అవుతుంది.

 కాపురం చేసినన్ని రోజులు చిత్రహింసలు పెట్టావు ఇప్పుడు మళ్లీ భార్యగా నటించమంటున్నావు తులసి ఎంత సెన్సిటివో నీకు కూడా తెలుసు కదా విడాకులు ఇచ్చిన భర్తతో నటిస్తుందని ఎలా అనుకున్నావు అని అంటాడు పరంధామయ్య.  అప్పుడు వాళ్ళిద్దరూ నందుని చెడమడా తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు లాస్య టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలోనే నందు అక్కడికి రావడంతో వచ్చావా నందు అసలు ఏం జరిగింది? ఏమన్నారు అనడంతో నందు జరిగింది మొత్తం వివరిస్తాడు. అప్పుడు నా వల్ల కాదు లాస్య వాసుదేవురాగానే నేను నిజం చెప్పేస్తాను అనడంతో ఇంకా అంతే సంగతులు ఒకప్పుడు నా వల్లే తన పని తేజరిపోయిందని నా మీద పీకల వరకు కోపంతో ఉన్నాడు అంటుంది లాస్య.

అప్పుడు నువ్వు అసలైన రూట్లో వెళ్ళావు. నేను రహదారి రూట్ లో వెళ్ళి ఏకంగా తులసి తోనే డీల్ చేస్తాను అని ధైర్యంగా అక్కడి నుంచి వెళ్తుంది లాస్య. మరోవైపు హాస్పిటల్ లో దివ్య సంజయ్ తో ఒక ఫైల్ గురించి మాట్లాడడానికి వెళుతూ ఉంటుంది. మరోవైపు హాస్పిటల్లో నర్స్ తో కలిసి సరదాగా రొమాంటిక్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు సంజయ్. ఇంతలో దివ్య అక్కడికి వచ్చి ఎంజాయ్ వాయిస్ విని అక్కడ ఏం జరుగుతుందో అని కర్టెన్ తెరిచి చూడగా అక్కడ నర్స్ తో ముద్దులు పెట్టుకుంటూ సంజయ్ ఎంజాయ్ చేస్తుండగా అది చూసి దివ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు నర్స్ దివ్య ను చూసి అక్కడ నుంచి పారిపోవడంతో వెంటనే సంజయ్ నిలదీస్తూ ఏం జరుగుతుంది సార్ ఇక్కడ అనడంతో హాస్పిటల్లో ఏ మూల ఏం జరుగుతుందో అని నువ్వు ఎంక్వయిరీ చేస్తున్నావా అని అంటాడు.

 నువ్వు నన్ను నిలదీయడం రెండు తప్పు నేను ఈ హాస్పిటల్ ఎండీ ని ఏమైనా చేస్తాను. నువ్వు ఆఫ్టర్ ఎంప్లాయ్ వి లిమిట్స్ లో నువ్వు ఉండు. ఎక్కువగా మాట్లాడితే నీకే తీసుకుని దివ్య నోరు మూయించి దివ్య చేతిలో ఉన్న ఫైల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు తులసి కిచెన్ లో పనిచేసుకుంటూ ఉండగా ఇంతలో లాస్య అక్కడికి వచ్చి తులసిని కాక పట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు లాస్య మాటలకు తులసి ఆశ్చర్య పోతుంది. నిజం చెప్తున్నాను తులసి నువ్వు చాలా మంచి దానివి నీ ఓపిక సహనం సిన్సియార్టీ ఇంకొకరికి సాధ్యం అవ్వదు అంటూ తులసిని పొగుడుతూ ఎలా అయినా తన బిడ్డలు వేసుకోవాలి అనుకుంటూ ఉంటుంది లాస్య. సడన్ గా ఇలా మీకు ఎందుకనిపించిందో తెలుసుకోవచ్చా అనడంతో ముదురు అప్పుడే పసిగట్టేసింది అనుకుంటూ సడన్ గా ఏం లేదు తులసి ఎప్పటినుంచో నీ మీద అభిప్రాయం ఉంది అంటూ లాస్య బిస్కెట్లు వేస్తూ ఉంటుంది.

 అప్పుడు తులసి చేతిలో ఉన్న టమోటాలు కింద పడిపోవడంతో లాస్య కింద పడిన టమోటాలు తీయడం మాత్రమే కాకుండా తులసి చీరను సర్దుతూ ఉంటుంది. అప్పుడు తులసి డైరెక్ట్ గా నన్ను ఏదో అడగాలని వచ్చావు అడుగు అనడంతో అప్పుడు లాస్య టెన్షన్ పడుతూ వాసుదేవ్ వస్తున్న విషయం తెలుసు కదా అంటూ అసలు విషయం చెప్పడంతో తులసి షాక్ అవుతుంది. అప్పుడు తులసి ఆయనతో కలిసి జీవించలేక నేను విడాకులు తీసుకున్నాను అలాంటిది ఆయన పక్కన ఎలా నటిస్తానని అనుకున్నావు అనడంతో లాస్య షాక్ అవుతుంది. నందు ఎదగాలని అనుకుంటున్నావు కదా అనడంతో ఆయన ఎదగాలని నేను కోరుకుంటున్నాను కానీ నేను దిగజారాలని అనుకోవడం లేదు అని లాస్య మీద సీరియస్ అవుతుంది తులసి. నువ్వు అడిగినది నేను చేయలేనిది చేయకూడని సహాయం అని తులసి లాస్య మీద మండిపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.మరోవైపు నందు లాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

ఇంతలో లాస్య అక్కడికి వచ్చి తులసి మీద ఉన్న కోపం అంతా నందు మీద చూపిస్తూ ఉంటుంది. దాంతో నందు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు హాస్పిటల్లో దివ్య రౌండ్స్ కి అని వెళ్తుండగా ఇంతలో విక్రమ్ ఫ్రెండ్ శిరీష పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకునే ఉంటుంది. అది చూసి దివ్య షాక్ అవుతుంది. అప్పుడు దివ్య శిరీష వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అనడంతో అది మమ్మల్ని చేసింది దాన్ని ప్రేమించినోడు మోసం చేశాడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకుంది అని ఆమె ఏడుస్తూ చెప్పడంతో దివ్య షాక్ అవుతుంది. అప్పుడు దివ్య విక్రమే ఆ అమ్మాయిని మోసం చేశాడు అనుకొని వాడి మీద పోలీస్ కేసు ఇవ్వండి అంటూ విక్రమ్ గురించి నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?
Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ