
గీతా ఆర్ట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్ద ఓ చిత్రం రిలీజ్ చేస్తోందంటే ఖచ్చితంగా మంచి అంచనాలే ఉంటాయి. అందులోనూ రీసెంట్ గా గీతా ఆర్ట్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేసిన కాంతారా చిత్రం సూపర్ హిట్ కావటం కూడా ఈ సంస్ద రిలీజ్ చేసే చిత్రాల పై ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సంస్ద రిలీజ్ చేస్తున్న చిత్రం"దోచేవారెవరురా..". కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు ఉన్న సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరరావు డైరక్షన్ లో రూపొందిన చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 11న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
గీతా ఆర్ట్స్ వారు తెలంగాణా , ఈస్ట్ గోదావరి, రాయచూర్, వెస్ట్ గోదావరి ఏరియాలు డిస్ట్రిబ్యూ చేస్తున్నారు. మిగతా ఏరియాలను రూర్వి పిక్చర్స్, శర్వాణి ఫిల్మ్స్, జీ3 మూవీస్, అంజలి పిక్చర్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. సీడెడ్ ఏరియాని శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ వారు, కర్ణాటక ఏరియాకు బృందా పిక్చర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ఇక శివనాగేశ్వరరావు ‘వన్ బై టూ, లక్కీ ఛాన్స్, మనీ మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం, వామ్మో వాత్తో ఓ పెళ్ళామా, ఓపనై పోతుంది బాబు, హ్యాండ్సప్’ లాంటి వరుస వైవిధ్య హాస్య కథలతో జనాన్ని అలరించారు. తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, ఫోటో, భూకైలాస్’ బాగున్నాయనిపిం చాయి. తాజాగా మరోసారి ఆయన నవ్వించటానికి రెడీ అవుతున్నారు. ఐక్యూ క్రియేషన్స్ పతాకం పై ప్రణవ చంద్ర, మాళవిక జంటగా నిర్మాత బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన ఔట్ & ఔట్ ఎంటర్ టైనర్ "దోచేవారెవరురా.."
దర్శకుడు శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ..ఒక ఫ్రెండ్ ద్వారా .శ్రీహరి గారు పరిచయ మయ్యారు. వారు మంచి సినిమా తీద్దామని చెప్పడంతో నేను పాన్ ఇండియా సినిమా తీద్దాం అంటే నీవు ఏది తీసిన అందులో కామెడీ ఉండాలి అన్నారు సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని కుటుంబ సామెతంగా కూర్చొని చూడదగ్గ సినిమాగా తెరకేక్కించడం జరిగింది. ఈ సినిమా కథ మొత్తం డబ్బుకు సంబందించిన అంశం చుట్టూ జరుగుతుంది.
ప్రస్తుత సమాజంలో మనము ఇంటినుండి బయటికి వచ్చిన తరువాత మనల్ని రకరకాలుగా దోచుకుంటున్నారు.ఇంతకుముందు ఎవర్ని దోచుకోవాలో సెలెక్ట్ చేసుకొని వారిని దోచుకొనే వారు. ప్రస్తుతం మనల్ని ఎవరు దోచుకోవాలో వారిని మనమే సెలెక్ట్ చేసుకుంటున్నాము ఓటు వేసి.అయితే ఇది పొలిటికల్ సినిమా కాదు ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ తో పాటు ఫుల్ ఔట్ & ఔట్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.
చిత్ర నిర్మాత బొడ్డు కోటేశ్వర రావు మాట్లాడుతూ..ఇందులో నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ సహకరించడంతో సినిమా బాగా వచ్చింది.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.
హీరో ప్రణవ మాట్లాడుతూ.. క్రిష్ దగ్గర దర్శకత్వ శాఖ లో పని చేస్తున్న నాకు శివనాగేశ్వర రావు గారు చేసే సినిమాలో హీరోగా చేసే అవకాశమిచ్చిన దర్శక, నిర్మాత కు ధన్యవాదాలు. నా కో ఆర్టిస్ట్ మాళవిక కూడా చాలా చక్కగా నటించింది. అజయ్ ఘోస్, బిత్తిరి సత్తి వంటి వారితో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు