చిరు - బాలయ్య - రజినీ & విక్రమ్.. సింగిల్ ఫ్రేమ్!

Published : Jan 14, 2019, 04:23 PM ISTUpdated : Jan 14, 2019, 04:28 PM IST
చిరు - బాలయ్య - రజినీ & విక్రమ్.. సింగిల్ ఫ్రేమ్!

సారాంశం

సౌత్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే టిఎస్ఆర్ అవార్డ్స్ డేట్  గురించి ఇటీవల ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17న వైజాగ్ వేదికగా సౌత్ లోని ప్రముఖ నటీనటుల మధ్య బహమతుల ప్రదానోత్సవ వేడుక జరగనుంది.

సౌత్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే టిఎస్ఆర్ అవార్డ్స్ డేట్  గురించి ఇటీవల ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17న వైజాగ్ వేదికగా సౌత్ లోని ప్రముఖ నటీనటుల మధ్య బహమతుల ప్రదానోత్సవ వేడుక జరగనుంది. ప్రముఖ బాలీవుడ్ నటి విద్య బాలన్ ను ఈ సంవత్సరం శ్రీదేవి మెమోరియల్ అవార్డుతో సత్కరించనున్నారు. 

అసలు విషయంలోకి వస్తే ఈవెంట్ లో ఒకే వేదికపై స్టార్ హీరోలు కనిపించనున్నారు. ఒకే ఫ్రేమ్ లో చాలా రోజుల తరువాత సౌత్ హీరోలు కనిపించడానికి సిద్దమవుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి - నందమూరి బాలకృష్ణ - నాగార్జున - వెంకటేష్ లు వేడుకలో పాల్గొంటుండగా వారితో పాటు కోలీవుడ్ హీరోలు రజినీకాంత్ - సూర్య - విక్రమ్ లు ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. 

సీనియర్ రాజకీయ నాయకుడు సినీ నిర్మాత టి.సుబ్బిరామి రెడ్డి ఆధ్వర్యంలో ఇవ్వనున్న ఈ TSR నేషనల్ అవార్డ్స్ సందర్బంగా కోలీవుడ్ - టాలీవుడ్ హీరోలు కెమెరా కంట పడితే సింగిల్ ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానులకు పండగే. అయితే మెగాస్టార్ - బాలకృష్ణ లు ఎదురుపడితే ఎలా ఉంటుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: జ్యోతో ఓ రేంజ్ లో ఆడుకున్న సూరజ్- మాలిని కుట్ర- అసలు మాలిని ఎవరంటే?
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ టీమ్ కు షాక్ ఇచ్చిన నాగార్జున, కింగ్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ డిమాండ్, నిజమెంత?