100 రోజులు పూర్తి చేసుకున్న ‘వాల్తేరు వీరయ్య’.. ఆ థియేటర్లలో డైరెక్ట్ రన్.. బాబీ స్పెషల్ నోట్

By Asianet News  |  First Published Apr 22, 2023, 4:15 PM IST

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ తాజాగా వంద రోజుల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఓటీటీలో చేరిన ఈ చిత్రం కొన్ని సెంటర్లలో వందరోజులు ఆడటం విశేషం. 
 


మెగాస్టార్ చిరంజీవి (Chirajeevi) మాస్ మహారాజా  రవితేజ  కలిసి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. తొలిరోజే అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకొని ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాతో కొన్ని సెంటర్లలో విజయవంతంగా వందరోజులు ఆడటం విశేషంగా మారింది.

సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ నేటితో 100 రోజులు థియేటర్లల్లో రన్ అయ్యింది. చీపురపల్లిలోని వంశీ థియేటర్, అవనిగడ్డలోని రామక్రిష్ణ థియేటర్ లో ఈ సినిమా డైరెక్ట్ గా వంద రోజుల రన్ ను పూర్తి చేసుకోవడం విశేషంగా మారింది. దీంతో మెగా అభిమానులు పుల్ ఖుషీ అవుతున్నారు. #100 Days of Watair Veerayyaను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 

Latest Videos

చిరంజీవి కేరీర్ లోనే బిగ్గేస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకోవడంతో దర్శకుడు బాబీ (Bobby) కూడా ట్వీట్ లో ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘మా మెగా మాస్ బ్లాక్‌బస్టర్ వాల్తేరు వీరయ్య 100 రోజుల మైలురాయిని పూర్తి  చేసింది. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. కేవలం ప్రియమైన మెగాస్టార్‌కి, మాస్ మహారాజాకు కృతజ్ఞతలు చెప్పగలను. అందరూ తమపై ఉంచిన నమ్మకం, గొప్ప ప్రేమకు ధన్యవాదాలు’.. అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. 

వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రుతిహాసన్ చిరు సరస ఆడిపాడింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్రం ఓటీటీ వేదికగా నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక బాక్సాఫీస్ వద్ద ‘వాల్తేరు వీరయ్య’ రూ.236 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.  ప్రస్తుతం చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Our MEGA MASS BLOCKBUSTER completes 💯 Days Milestone 🤩

Can't express my feeling in words, I can only thank our dearest Megastar garu & Mass Maharaja garu for all the trust and Magnanimous love ❤️ pic.twitter.com/ijeGrAfINK

— Bobby (@dirbobby)
click me!