హీరో బూతు ట్వీట్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

By AN TeluguFirst Published Apr 24, 2019, 2:20 PM IST
Highlights

తెలంగాణాలో పదహారు మంది ఇంటర్మీడియట్ విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణాలో పదహారు మంది ఇంటర్మీడియట్ విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. ఇంటర్మీడియట్ బోర్డ్ తప్పిదం, అధికారుల నిర్లక్ష్యం ఇలా కారణం ఏదైనా.. విద్యార్ధుల ప్రాణాలు మాత్రం పోయాయి. 

దీంతో స్టూడెంట్స్ లో ధైర్యం నింపడానికి చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. యంగ్ హీరో రామ్ కూడా ఓ పోస్ట్ పెట్టాడు. స్టూడెంట్స్ అంతా ధైర్యంగా ఉండాలని, ఇంటర్ మార్కులు మాత్రమే జీవితం కాదంటూ మధ్యలో ఓ బూతుపదం కూడా వాడాడు. 

దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. తల్లితండ్రుల వద్ద డబ్బులు బాగా ఉంటే.. పదో తరగతి ఫెయిల్ అయినా పర్వాలేదంటూ రామ్ పై ఫైర్ అయ్యారు. వ్యవస్థలకు క్లాస్ పీకడం మానేసి, స్టూడెంట్స్ కి క్లాస్ పీకుతున్నారంటూ రామ్ పై విరుచుకుపడ్డారు. పిల్లలకు క్లాస్ పీకే రామ్ తెలంగాణా ప్రభుత్వాన్ని కానీ, ఇంటర్మీడియట్ బోర్డ్ ని కానీ ఒక్క మాట అనగలడా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.

దీనిపై స్పందించిన రామ్.. ''పార్క్ లో కూర్చొని బిస్కెట్లు తినే పిల్లలకు ఎలా చెప్పినా వింటారని.. బెడ్ రూమ్ లాక్ చేసుకొని లైఫ్ ఎలారా బాబు అనుకునే పిల్లలకు ఇలా నిజాలు చెబితేనే వింటారంటూ'' ట్వీట్ చేసి తనను తాను సమర్ధించుకున్నాడు. అంతేకాదు.. ఇంటర్ కూడా పూర్తిచేయని సచిన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ లో రాసుకొచ్చాడు. 

click me!