నాగార్జునని సంపూతో పోలుస్తూ.. ఆడుకుంటున్నారు!

Published : Aug 10, 2019, 04:01 PM ISTUpdated : Aug 10, 2019, 04:24 PM IST
నాగార్జునని సంపూతో పోలుస్తూ.. ఆడుకుంటున్నారు!

సారాంశం

అక్కినేని నాగార్జున తన కెరీర్లో అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది ఇప్పుడే. కెరీర్‌కే మచ్చగా నిలిచిన ‘ఆఫీసర్’ ఆయన మార్కెట్‌ను, ఇమేజ్‌ను దెబ్బ తీసేసింది. ఆ ప్రభావం నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదు.   

అక్కినేని నాగార్జున నటించిన 'మన్మథుడు 2' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమాకి ఆశించిన ఫలితం దక్కలేదు. చాలా ఏరియాల నుండి సినిమాకి నెగెటివ్ టాక్ వస్తోంది. సినిమా రిజల్ట్ ఏంటో తొలి షోతోనే తేలిపోయింది.

ఈ టాక్ ని తట్టుకొని సినిమా నిలబడడం కష్టమే.. ఇది ఇలా ఉండగా.. ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియాలో నాగార్జునను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన గురించి అవమానకరమైన కామెంట్స్ చేస్తున్నారు. నాగ్ తన కెరీర్ లో ఇంత నెగెటివిటీ ఎప్పుడూ చూసి ఉండరు. అంతగా అతడిని ట్రోల్ చేస్తున్నారు.

శనివారం నాడు రిలీజైన సంపూర్నేష్ బాబు 'కొబ్బరిమట్ట' సినిమాకి 'మన్మథుడు 2' కంటే ఎక్కువ క్రేజ్ ఉందని.. 'కొబ్బరిమట్ట' ముందు 'మన్మథుడు 2' నిలవడం కష్టమని పేర్కొంటూ 'స్మాలర్ దన్ సంపూ' అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి నాగార్జునను ట్రోల్ చేస్తున్నారు. సంపూ లాంటి నటుడితో నాగ్ ని పోల్చడం అతడి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 

'ముసలి మన్మథుడు' అనే హ్యాష్ ట్యాగ్స్, కామెంట్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినిమాలో కూడా నాగ్ తన మీద తనే ఏజ్ విషయంలో రెండు, మూడుసార్లు కామెంట్ చేసుకోవడంతో ట్రోలర్లకు మరింత కంటెంట్ దొరికింది.   

PREV
click me!

Recommended Stories

అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..? బాలయ్య సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే