రూమర్స్ కి చెక్.. చిరు సర్ అడగాలే కానీ.. కాజల్ అగర్వాల్!

Published : Aug 10, 2019, 03:42 PM IST
రూమర్స్ కి చెక్.. చిరు సర్ అడగాలే కానీ.. కాజల్ అగర్వాల్!

సారాంశం

అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం గడుస్తున్నా ఆమె క్రేజ్ ఇంకా తగ్గలేదు. చెక్కు చెదరని బ్యూటీ, మంచి నటనతో కాజల్ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం శర్వానంద్ సరసన రణరంగంలో నటిస్తోంది. ఆగష్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో కాజల్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది.   

కాజల్ నటించబోయే చిత్రాల గురించి అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై కాజల్ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో త్వరలో చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రం కోసం చాలామంది హీరోయిన్లని పరిశీలించిన తర్వాత చివరకు కాజల్ అగర్వాల్ ని ఓకే చేశారని ఇటీవల రూమర్స్ వినిపించాయి. 

చిరు, కొరటాల సినిమా గురించి కాజల్ మాట్లాడుతూ.. ఆ చిత్రం కోసం నన్నెవరూ సంప్రదించలేదు. చిరు సర్ సినిమా కోసం నన్ను అడగలే కానీ ఎందుకు చేయను. సంతోషంగా ఒప్పుకుంటా అని కాజల్ సమాధానం ఇచ్చింది. ఇక కాజల్ కు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ సరసన నటించే ఛాన్స్ కూడా వచ్చింది. భారతీయుడు 2 కోసం కాజల్ ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 

ఈ చిత్రం డిలే అవుతుండడంతో కాజల్ తప్పుకుందని వార్తలు వచ్చాయి. అలాంటిదేమి లేదని, ఇండియన్ 2లో తాను పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నానని కాజల్ క్లారిటీ ఇచ్చింది. రణరంగం చిత్రంలో తనది పెద్ద పాత్ర కాకున్నా చేశానని కాజల్ అంటోంది. కథలో నా పాత్ర చాలా కీలకం అందుకే నటించానని కాజల్ తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..? బాలయ్య సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే