అఫీషియల్: నిర్మాతగా త్రివిక్రమ్ సతీమణి.. హీరోగా నవీన్ పోలిశెట్టి

pratap reddy   | Asianet News
Published : Sep 15, 2021, 10:51 AM ISTUpdated : Sep 15, 2021, 11:47 AM IST
అఫీషియల్: నిర్మాతగా త్రివిక్రమ్ సతీమణి.. హీరోగా నవీన్ పోలిశెట్టి

సారాంశం

ఇది నిజంగా సర్ ప్రైజింగ్ లాంటి అప్డేట్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. 

ఇది నిజంగా సర్ ప్రైజింగ్ లాంటి అప్డేట్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. తెరవెనుక అంతా చూసుకునేది త్రివిక్రమ్  అయినప్పటికీ.. యాక్టివ్ నిర్మాతగా మాత్రం ఆయన సతీమణి సౌజన్య వ్యవహరించనున్నారు. ఫార్చూన్ 4 సినిమాస్ అనే బ్యానర్ ని త్రివిక్రమ్ ప్రారంభించారు. 

ఈ బ్యానర్ లో తొలి చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ నిర్మాణంలో యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి హీరోగా చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి నాగవంశీతో పాటు త్రివిక్రమ్ సతీమణి నిర్మాతగా వ్యవహరించనున్నారు. 

డెబ్యూ దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. త్రివిక్రమ్, నాగవంశీ, చినబాబు(రాధాకృష్ణ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. త్రివిక్రమ్ చాలా కాలంగా చినబాబు నిర్మాణంలోనే చిత్రాలు చేస్తున్నారు. 

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు చిత్రాలతో ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నాడో చెప్పనవసరం లేదు. అతడి కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. జాతి రత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నవీన్ నుంచి రాబోతున్న చిత్రం ఇదే. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

100 ఎకరాల పొలం, వంట కూడా రావాలి.. కాబోయే భర్తపై రవితేజ హీరోయిన్ కండిషన్స్
Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెన్సార్‌ రివ్యూ.. పవన్‌ సినిమాని ఎవరు చూడొచ్చు, నిడివి ఎంత అంటే?