ఎన్టీఆర్ వెనుకడుగులో త్రివిక్రమ్ ఆలోచన?

Published : Dec 20, 2018, 03:01 PM IST
ఎన్టీఆర్ వెనుకడుగులో త్రివిక్రమ్ ఆలోచన?

సారాంశం

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె గెలవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. 

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె గెలవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. ప్రచారాలకు ఎన్టీఆర్ వచ్చినా కూడా గెలిచేవారు కాదని అది ముందే జూనియర్ గ్రహించడం మంచిదైందని అంతా భావించారు. 

ఇకపోతే తారక్ వెనుకడుకు వేయడానికి అసలు కారణం త్రివిక్రమ్ అని ప్రస్తుతం పలు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడని త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు ఎందుకు సలహాలు ఇస్తాడు అనే ప్రశ్న కూడా వెలువడుతోంది. అయితే త్రివిక్రమ్ - తారక్ అరవింద సమెత సమయంలో చాలా దగ్గరయ్యారు. 

ఎన్టీఆర్ త్రివిక్రమ్ ను ఒక బంధువులా ట్రీట్ చేశాడు. అయితే ఆ చొరవతోనే త్రివిక్రమ్ ఎన్నికల్లో అనవసరంగా రిస్క్ చేయవద్దని పరిస్థితులు కూడా అనుకూలంగా లేవని సలహాలు ఇచ్చినట్లు టాక్ వస్తోంది. జూనియర్ కూడా త్రివిక్రమ్ చెప్పిన మాటలకు కట్టుబడి ఉండటంతో మంచిదైందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే వారే క్లారిటీ ఇవ్వాలి. 

PREV
click me!

Recommended Stories

Top 5 OTT Movies: ఓటీటీలో టాప్ 5 రీసెంట్ బెస్ట్ మూవీస్.. ఆ ఒక్క మూవీని భార్య భర్తలు అస్సలు మిస్ కాకండి
సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?