గతంలో వీళ్లిద్దరు కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవలోనూ రాజకీయాల ప్రస్దావన ఉంటాయని రూమర్స్ వచ్చాయి. కానీ సినిమాలో అలాంటివేమీ లేవు. అలాంటివాటి జోలికి పోయేటంత తెలివితక్కువవాడు కాదు త్రివిక్రమ్.
పెద్ద హీరోల సినిమాల కథలు ఎలా ఉంటాయనేది అందరికీ ఆసక్తికరమే. దాంతో మీడియాలో ఈ సినిమాలపై కథనాలు ఎప్పటికప్పుడూ వస్తూనే ఉంటాయి. వాటిల్లో చాలా వరకూ రూమర్సే ఉంటాయి. కథ ఇదేనట..ఫలానా విధంగా ఉండబోతోందిట..ఫలానా ఎలిమెంట్స్ ఉంటాయట అని ఆ కథ రాసేవాళ్లకు కూడా తెలియని విషయాలు మీడియాలో ప్రచారం చేస్తూంటారు. చివరకు టైటిల్ కూడా మీడియావాళ్లే ఒకటి అనుకుని ప్రకటించేస్తూంటారు. అయితే కావాలని కొన్ని సార్లు సదరు దర్శక,నిర్మాతలు తమ టైటిల్, స్టోరీ లైన్ ని లీక్ చేసి రెస్పాన్స్ చూస్తూంటారు. అయితే అది తక్కువగా జరుగుతూంటుంది. గతంలో చాలా సార్లు పెద్ద హీరోల సినిమాలకు అలాగే జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందించబోయే సినిమా గురించి మీడియాలో,సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది.
ఈ సినిమాలో త్రివిక్రమ్ ..పొలిటికల్ డైలాగులు కొన్ని కలుపుతున్నారని అంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను అందులో ప్రస్తావించనున్నారని చెప్పుకుంటున్నారు. అయితే సినిమా మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగుతుందని వినికిడి. కాని ఎన్టీఆర్ గత కొంతకాలంగా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తుున్నారు. ఈ నేపధ్యంలో ఆయన సినిమాల్లో రాజకీయాల ప్రస్తావన ఉంటుందా అనేది సందేహమే. మార్చి నుంచి మొదలయ్యే ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. గతంలో వీళ్లిద్దరు కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవలోనూ రాజకీయాల ప్రస్దావన ఉంటాయని రూమర్స్ వచ్చాయి. కానీ సినిమాలో అలాంటివేమీ లేవు. అలాంటివాటి జోలికి పోయేటంత తెలివితక్కువవాడు కాదు త్రివిక్రమ్.
మరోవైపు ఎన్టీఆర్ సినిమాలో అదిరిపోయే సర్ప్రైజ్ ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తల్లి షామిలి నటించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. యంగ్ టైగర్ అమ్మ పాత్రలో నిజ జీవిత తల్లే నటించబోతోందని రాసేస్తున్నారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి పేరును త్రివిక్రమ్ శ్రీనివాస్ రిఫర్ చేశాడని.. ఆ పాత్రకు ఆమె అయితే బాగుంటుంది అని ఆయనను కన్విన్స్ చేశాడని చెప్తున్నారు. అన్నింటికి మించి పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని.. అందుకే తన తల్లిని నటింపచేస్తే బాగుంటుందని ఆలోచన జూనియర్ ఎన్టీఆర్ లో వచ్చినట్లు మీడియాలోనూ రూమర్స్ మొదలయ్యాయి.
అయితే ఒక్క సెకను నిజాయతీగా ఆలోచిస్తే ..ఎన్టీఆర్ ఎప్పుడూ తన కుటుంబాన్ని తెర మీదకు తీసుకురావటానికి ప్రయత్నించరని గుర్తు వస్తుంది. ఇప్పటిదాకా ఫ్యామిలీ ఫొటోలే పెద్దగా బయిటకు రాలేదు. తెర వెనక..తెర ముందు రెండింటి విభజన ఎన్టీఆర్ కు బాగా తెలుసు. ఇవన్నీ ప్రక్కన పెడితే...ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన ను అనుకుంటున్నారు. తమన్ సంగీతం అందించబోతున్నాడు. దీనికి అయిననూ పోవలే హస్తినకు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.