హ్యాట్రిక్‌ కోసం ప్లాన్‌ చేస్తున్న మహేష్‌, త్రివిక్రమ్‌

Published : Aug 30, 2020, 04:19 PM IST
హ్యాట్రిక్‌ కోసం ప్లాన్‌ చేస్తున్న మహేష్‌, త్రివిక్రమ్‌

సారాంశం

తాజాగా మహేష్‌, త్రివిక్రమ్‌ మధ్య కథా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. కరోనా నేపథ్యంలో ఉన్న ఖాళీ సమయంలో మహేష్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులను మాటల మాంత్రికుడు పూర్తి చేశారని, అంతేకాదు, మహేష్‌ని కలిసి కథ కూడా వినిపించాడని సమాచారం.  

మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే `అతడు`, `ఖలేజా` చిత్రాలు వచ్చాయి. `అతడు` ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా థియేటర్‌లో కంటే టీవీలో ఎక్కువగా ఆడింది. ఎక్కువసార్లు టెలికాస్ట్ అయిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. చాలా విషయాలకు ఇదొక స్ఫూర్తిగానూ నిలిచింది. మరో చిత్రం `ఖలేజా` డిజాస్టర్‌గా నిలిచింది. 


వీరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా కోసం చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు వర్కౌట్‌ కాలేదు. ఇప్పట్లో వీరి కాంబినేషన్‌లో సినిమాని ఎవరూ ఊహించడం లేదు. ఎందుకంటే ఓ వైపు మహేష్‌ తన ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు, మరోవైపు త్రివిక్రమ్‌ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లను లైన్‌లో పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా అనే ప్రస్తావనే లేదు. 

కానీ ఉన్నట్టుండి తాజాగా మహేష్‌, త్రివిక్రమ్‌ మధ్య కథా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. కరోనా నేపథ్యంలో ఉన్న ఖాళీ సమయంలో మహేష్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులను మాటల మాంత్రికుడు పూర్తి చేశారని, అంతేకాదు, మహేష్‌ని కలిసి కథ కూడా వినిపించాడని, ఈ విషయంలో మహేష్‌ కాస్త సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. అన్ని కుదిరితే ఇది మహేష్‌ నెక్ట్స్ సినిమాగానే తెరకెక్కే అవకాశాలున్నట్టు టాక్‌. ఇదే సెట్‌ అయితే హ్యాట్రిక్‌ ఖాయమనే చెప్పాలి. మరి అది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో, ఈ లోపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

మహేష్‌బాబు ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళితో ఓ సినిమా చేసే అవకాశాలున్నాయి. మరోవైపు త్రివిక్రమ్‌.. ఎన్టీఆర్‌తో సినిమాని ప్రకటించారు. అంతేకాదు చిరంజీవితోనూ చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

బాలకృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ వల్ల డిజాస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? దర్శకుడు ఎంత చెప్పినా రామారావు ఎందుకు వినలేదు?
Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్