సితార మహేష్‌ గర్ల్ అట.. నమ్రత ఫన్నీ కామెంట్‌

Published : Aug 30, 2020, 03:01 PM ISTUpdated : Aug 30, 2020, 03:04 PM IST
సితార మహేష్‌ గర్ల్ అట.. నమ్రత ఫన్నీ కామెంట్‌

సారాంశం

మహేష్‌ తన గారాల పట్టి సితారతో ఫన్‌ టైమ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. సరదాగా కబుర్లు చెబుతున్నారు. సితార మాట్లాడే ముద్దు ముద్దు మాటలు వింటూ తండ్రిగా మంచి అనుభూతిని పొందుతున్నారు. 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం కరోనా వల్ల ఇంటికే పరిమితమై ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎక్కువగా తమ పిల్లలు గౌతమ్‌, సితారలో సరదాగా గడుపుతున్నారు.  వీరిద్దరిలో ఎక్కువగా మహేష్‌ తన గారాల పట్టి సితారతో ఫన్‌ టైమ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. సరదాగా కబుర్లు చెబుతున్నారు. సితార మాట్లాడే ముద్దు ముద్దు మాటలు వింటూ తండ్రిగా మంచి అనుభూతిని పొందుతున్నారు. 

తాజాగా అలాంటి సరదా, ఫన్నీ మూవ్‌మెంట్‌ మహేష్‌ ఇంట్లో చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం సితార ల్యాప్‌టాప్‌లో ఏదో ఫన్నీ వీడియోలు చూస్తుండగా, మహేష్‌ ఆమె దగ్గరకు వెళ్ళి సితార ఏం చూస్తుందనేది గమనిస్తున్నాడు. దీంతో సితార నవ్వుతూ మహేష్‌పై ఓ కాలు వేసింది. సన్నివేశాన్ని నమ్రతా కాప్చర్‌ చేసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఈ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నమ్రతా అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా `సితార డాడీ గర్ల్` అంటూ కామెంట్‌ పెట్టింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

మహేష్‌ గారాల పట్టి సితార గతేడాది యానిమేషన్‌ చిత్రం `ఫ్రోజెన్‌ 2`లో బేబీ ఎల్సాకి వాయిస్‌ ఓవర్‌ అందించిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

సమంత, అఖిల్ అక్కినేనితో పాటు 2025లో పెళ్లి చేసుకున్న 10 జంటలు ఎవరో తెలుసా?
Sivaji: సామాన్లు కనపడేలా బట్టలు వేసుకోకండి... అమ్మాయిల దుస్తులపై శివాజీ షాకింగ్ కామెంట్స్