మరోసారి సునీల్ కి త్రివిక్రమ్ ఛాన్స్!

Published : Jan 06, 2019, 06:25 PM IST
మరోసారి సునీల్ కి త్రివిక్రమ్ ఛాన్స్!

సారాంశం

త్రివిక్రమ్, సునీల్ లు మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో కెరీర్ ఆరంభం కాకముందు నుండి వీరిద్దరికి మంచి బంధం ఉండేది. ఆ కారణంగానే త్రివిక్రమ్ చిత్రాలలో సునీల్ కి అవకాశాలు ఇస్తుంటాడు. 

త్రివిక్రమ్, సునీల్ లు మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో కెరీర్ ఆరంభం కాకముందు నుండి వీరిద్దరికి మంచి బంధం ఉండేది. ఆ కారణంగానే త్రివిక్రమ్ చిత్రాలలో సునీల్ కి అవకాశాలు ఇస్తుంటాడు.

సునీల్ కమెడియన్ గా ఉన్నన్ని రోజులు త్రివిక్రమ్ తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చాడు. ఎప్పుడైతే సునీల్ హీరోగా మారాడో.. అప్పటినుండి వీరి కాంబోలో సినిమాలు తగ్గాయి. హీరోగా అవకాశాలు తగ్గడంతో సునీల్ తిరిగి కామెడీ వేషాలు వేయడం మొదలుపెట్టాడు.

కానీ కమెడియన్ గా సునీల్ ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ కాలేకపోతున్నాడు. త్రివిక్రమ్ 'అరవింద సమేత', శ్రీనువైట్ల 'అమర్ అక్బర్ ఆంటోనీ', 'పడి పడి లేచే మనసు' చిత్రాలలో సునీల్ కమెడియన్ గా కనిపించాడు కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ తన సినిమాలో సునీల్ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ రూపొందించబోయే సినిమాలో సునీల్ ని తీసుకున్నట్లు సమాచారం. ఈసారి సునీల్ లో కమెడియన్ ని బయటకి లాగేలా, తన కెరీర్ కి ఉపయోగపడేలా ఈ పాత్రని  తీర్చిదిద్దాడట. మరి ఈసారైనా త్రివిక్రమ్ తన మార్క్ కామెడీతో మెప్పిస్తాడేమో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?