దిల్ రాజు ఓటు సమంతకే, కానీ డైరక్టర్ ఏమో...

Published : Dec 22, 2018, 12:41 PM IST
దిల్ రాజు ఓటు సమంతకే, కానీ డైరక్టర్ ఏమో...

సారాంశం

శర్వానంద్  తాజా ప్రేమ కథా  చిత్రం 'పడి పడి లేచె మనసు' నిన్నే విడుదలైంది. ఆయన తదుపరి చిత్రం కూడా ఫైనలైజ్ అయ్యింది.  విజయ్ సేతుపతి, త్రిష తమిళంలో నటించిన '96'. ఈ సినిమా తమిళ్‌‌‌లో ఘన విజయం సాధించిన చిత్రం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

నిజ జీవితంలో జరిగే కథతో దానికి సరిపోయో కథ, కథనాలతో, వాస్తవాలకి  దగ్గరగా నిర్మించారు. ఈ సినిమాని తమిళ ప్రేక్షకులు పెద్ద హిట్ చేసేసారు.  ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు హీరోయిన్ సమస్య వచ్చిందని సమాచారం. 

నిర్మాత దిల్ రాజు కు ...సమంతను హీరోయిన్ గా పెట్టి ప్రాజెక్టు చెయ్యాలని ఉంది. సమంత సీన్ లోకి వస్తే వచ్చే క్రేజ్ వేరు. అయితే దర్శకుడు ప్రేమ్ కుమార్ మాత్రం ..తమిళంలో చేసిన త్రిషను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. త్రిష ఫెరఫెక్ట్ ఛాయిస్ అని వాదిస్తున్నారట.

ఈ విషయంలో దిల్ రాజు, దర్శకుడు మధ్య వాదన ఓ కొలిక్కి రాలేదని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అయితే శర్వానంద్ కూడా తన ప్రక్కన త్రిష అంటే పెద్దదానిగా ఉంటుందని భావిస్తున్నారట. అదే సమంత అయితే తెలుగు మార్కెట్ కు కూడా బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేసారు. తమిళ వెర్షన్ రూపొందించిన ప్రేమ్ కుమారే తెలుగులోనూ దర్శకత్వం వహించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానుంది.

PREV
click me!

Recommended Stories

హీరోకి రూ.110 కోట్లు, హీరోయిన్ కి రూ.2 కోట్లు.. ఏమాత్రం సంబంధం లేని రెమ్యునరేషన్స్ వైరల్
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ రొమాంటిక్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. డీటెయిల్స్ ఇవిగో