మరోసారి తెరపైకి త్రిష పెళ్లి.. ముందస్తు ప్లాన్‌ అందుకేనా?

Published : Sep 01, 2021, 02:03 PM IST
మరోసారి తెరపైకి త్రిష పెళ్లి.. ముందస్తు ప్లాన్‌ అందుకేనా?

సారాంశం

దర్శక దిగ్గజం మణిరత్నం తెరెక్కిస్తున్న `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రంలోని త్రిష పాత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఆ తర్వాత ఆమె ఏ ఒక్క చిత్రంలోనూ కమిటవలేదు. తెలుగులో చిరంజీవి చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైందనే వార్తలొస్తున్నాయి. 

త్రిష పెళ్లి చేసుకోబోతుందనే వార్త మరోసారి ఆటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు గతంలో చాలా సార్లు వినిపించాయి. కానీ అవన్నీ గాలి వార్తలుగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో మరోసారి `త్రిష మ్యారేజ్‌` న్యూస్‌ చక్కర్లు కొట్టడం విశేషం. ముందస్తు ప్లాన్‌ రెడీ చేసుకుంటుందని తెలుస్తుంది. 

కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఫిట్‌నెస్‌ని మెయింటేన్‌ చేస్తున్న త్రిష ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగుతున్నారు. ఆమె చేతిలో ఇప్పుడు `పొన్నియిన్‌ సెల్వన్‌`, `చదురంగ వేట్టై-2`, `రాంగీ`, `గర్జనై` వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఒక్క `పొన్నియిన్‌ సెల్వన్‌` మినహా మిగిలిన చిత్రాల షూటింగ్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్య క్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అదే సమయంలో దర్శక దిగ్గజం మణిరత్నం తెరెక్కిస్తున్న `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రంలోని తన భాగం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

 ఆ తర్వాత ఆమె ఏ ఒక్క చిత్రంలోనూ కమిటవలేదు. తెలుగులో చిరంజీవి చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైందనే వార్తలొస్తున్నాయి. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే త్రిష మాత్రం త్వరలోనే పెళ్ళి పీటలెక్కనుందని, అందుకే ఆమె కొత్త ప్రాజె క్టులను అంగీకరించడం లేదన్నది కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇదే విషయాన్ని ఆమెకు సన్నిహిత వర్గాలు కూడా వెల్లడించాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే త్రిష స్పందించాల్సిందే. 

ఇదిలా ఉంటే గతంలో త్రిష.. వరుణ్‌ మణియన్‌ అనే బిజినెస్‌మేన్‌తో నిశ్చితార్థం చేసుఉంది. కానీ ఏం జరిగిందో ఏమో దాన్ని క్యాన్సిల్‌ చేసుకున్నారు. అప్పటి నుంచి త్రిష ఒంటరిగానే ఉంటోంది. శింబుతో ప్రేమాయణం నడిపించిందంటూ వార్తలొచ్చాయి. వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకోబోతున్నారని కూడా పుకార్లు చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్