నిర్మాతని నిండా ముంచిన ‘జబర్దస్త్’ కమెడియన్?

By Surya PrakashFirst Published Sep 1, 2021, 1:09 PM IST
Highlights

తన కల, జీవితాశయం డైరక్టర్ అవ్వడమే అంటూ...చేతిలో ఒక్క సినిమా కూడా లేని ఔట్ డేటెడ్ సీనియర్ హీరోను పట్టుకుని కథ చెప్పి ఒప్పించాడట. ఆయన ఖాళీగా ఉన్నాడు కాబట్టి సరే అన్నాడట. 


డైరక్టర్ అవ్వాలని, హీరో అవ్వాలని చాలా మందికి ఉంటుంది. అందులోనూ పరిశ్రమలో కొంతకాలంగా ఉంటూ పరిచయాలు ఉన్నవాళ్లకు మరీ ఈ కోరిక ఎక్కువగా ఉంటుంది. అయితే అందరి టార్గెట్ ఎదగాలనేదే కాబట్టి తప్పు కూడా అనిపించదు. కానీ ఆ పేరుతో వేరే వాళ్ల డబ్బుతో ఆటలాడితే మాత్రం ఇబ్బందే. ఇలాంటి సంఘటన రోజూ ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి. ఆశతో వచ్చే  డబ్బున్న వాళ్లను ముంచేవాళ్లు ఉంటారు. తాజాగా అలాంటి ఉదంతమే జరిగిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

అందుతున్న సమాచారం మేరకు...కొన్నేళ్ల పాటు జబర్దస్త్‌లో కమిడియన్ గా వెలిగిన ఓ హాస్య నటుడు... ఆ తర్వాత ఛానెల్ మారాడు. అలాగే ఈ మధ్యే దర్శకుడిగా మారాడు. తన కల, జీవితాశయం డైరక్టర్ అవ్వడమే అంటూ...చేతిలో ఒక్క సినిమా కూడా లేని ఔట్ డేటెడ్ సీనియర్ హీరోను పట్టుకుని కథ చెప్పి ఒప్పించాడట. ఆయన ఖాళీగా ఉన్నాడు కాబట్టి సరే అన్నాడట. 

అంతేకాకుండా  అలాగే తన ఊరు నుంచే ఓ నిర్మాతను కూడా తెచ్చుకుని సినిమా మొదలు పెట్టాడు. మొదట సినిమాకే కోట్ల రూపాయల బడ్జెట్ ప్లాన్ చేసాడు సదరు కమెడియన్.అయితే ఆ నిర్మాతకు అవగాహన లేపోవటంతో సీన్ లోకి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాడు. అయిత ఆ తర్వాత ఆ హీరోకు కోటి రూపాయలు కూడా మార్కెట్ లేదని రివీల్ అయ్యింది. దాంతో కోటి కూడా వెనక్కి రాని హీరోని పట్టుకుని.. కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టలేనని చెప్పాసాడు. దానికి తోడు ఆ కమిడియన్ కు డైరక్షన్ లో ఓనమాలు కూడా రావని తెలుసుకున్నాడట. 

దాంతో ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయని సమాచారం.చివరకు తన డబ్బులు మొత్తం కట్టాలంటూ మన జబర్దస్త్ దర్శకుడికి వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా పేరుతో 30 లక్షల వరకు ఖర్చు చేయించాడట ఆ కమెడియన్ డైరక్టర్. సదరు డైరక్టర్ తన దగ్గర పైసా కూడా లేదని చేతులెత్తేయటంతో ..ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేయాలాని ఫిక్స్ అయ్యారట. అయితే ఆ కమిడియన్ ఎవరనేది మాత్రం బయిటకు రాలేదు. ఆ హీరో ఎవరనేది తెలియరాలేదు. అసలు విషయాలు బయిటకు వస్తే కానీ క్లారిటీ రాదు. 

click me!