నాన్న అలా చేయడంతో క్రికెట్ పై ఇష్టం పోయింది

By team teluguFirst Published Sep 1, 2021, 1:47 PM IST
Highlights

ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగుతుండగా, పార్టిసిపంట్స్ తో పాటు ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా ఎవరు మీలో కోటీశ్వరులు షో వేదికగా ఎన్టీఆర్ క్రికెట్ పై తన అభిప్రాయం తెలియజేశారు.

బుల్లితెరపై ఎన్టీఆర్ సందడి షురూ చేశారు. ఆయన హోస్ట్ ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో ప్రారంభం కావడంతో పాటు, కొన్ని ఎపిసోడ్స్ కూడా ముగిశాయి. ఈ షో మొదటి గెస్ట్ గా రామ్ చరణ్ రావడంతో హాట్ సీట్ లో కూర్చొని ఎన్టీఆర్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇక ఎన్టీఆర్ వెండితెరపై కనిపించి మూడేళ్లు కావస్తుంది. 2018లో విడుదలైన అరవింద సమేత వీర రాఘవ చిత్రం తరువాత ఆయన నుండి మరో చిత్రం విడుదల కాలేదు. 

దీనితో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కి ఆయన బుల్లితెరపై కనిపించడం పెద్ద ఉపశమనం. ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగుతుండగా, పార్టిసిపంట్స్ తో పాటు ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా ఎవరు మీలో కోటీశ్వరులు షో వేదికగా ఎన్టీఆర్ క్రికెట్ పై తన అభిప్రాయం తెలియజేశారు. అలాగే తన తండ్రి దివంగత హరికృష్ణను గుర్తు చేసుకున్నారు. 

ఎన్టీఆర్ మాట్లాడుతూ... క్రికెట్ ఆడడం నాకు చాలా ఇష్టం, అయితే టీవీలో చూడడానికి అంతలా ఇష్టపడను. దానికి కారణం మా నాన్నగారు అని చెప్పాలి. మొదట్లో నేను క్రికెట్ చూడడానికి ఇష్టపడే వాడిని. అయితే అప్పట్లో నాన్నగారు లైవ్ క్రికెట్ మ్యాచ్ ని వీసీఆర్ లో రికార్డుచేయమనేవారు. రికార్డు చేసిన మ్యాచ్ సాయంత్రం మరోమారు నాన్నతో పాటు చూడాల్సి వచ్చేది. దాని వలన నాకు క్రికెట్ మ్యాచ్ లు టీవీలో చోడడంపై ఆసక్తి పోయిందని, ఎన్టీఆర్ తెలియజేశారు. 

click me!