
త్రిషకి 2023 సూపర్ సక్సెస్ ఫుల్ ఇయర్ అనే చెప్పాలి. పొన్నియన్ సెల్వన్ 2 లాంటి భారీ చిత్రం విజయం సాధించింది. అలాగే రీసెంట్ గా దళపతి విజయ్ లియో చిత్రంలో కూడా మెరిసింది. రెండు బ్లాక్ బస్టర్స్ తో త్రిష ప్రస్తుతం హై జోష్ లో ఉంది.
మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో త్రిష గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. లియో చిత్రంలో అవకాశం వచ్చి ఉంటే త్రిషతో రేప్ సీన్ లో నటించే వాడిని అంటూ మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే చెలరేగింది. త్రిషకి పలువురు సెలెబ్రిటీలు మద్దతు తెలిపారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే త్రిష తన ఫొటోలతో పాటు అభిప్రాయాలని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన యానిమల్ చిత్రం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
యానిమల్ చిత్రానికి త్రిష తనదైన శైలిలో సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చింది. యానిమల్ పోస్టర్ షేర్ చేస్తూ.. ఒక్కటే మాట.. యానిమల్ కల్ట్ మూవీ అంతే అంటూ పోస్ట్ చేసింది. ఆశ్చర్యకరంగా త్రిష పోస్ట్ చేసిన కొద్ది సేపటికే డిలీట్ చేసింది. త్రిష యానిమల్ చిత్రానికి రివ్యూ ఇచ్చిన వెంటనే సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి.
కొద్దిరోజుల క్రితమే త్రిష మహిళల ఆత్మగౌరవం గురించి, వారిపై వేధింపుల గురించి పోరాటం చేసింది. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలతో ఇబ్బందులు పడిన త్రిష.. ఇప్పుడు అసభ్యకర శృంగార సన్నివేశాలు.. బూతు డైలాగులు ఉన్న యానిమల్ చిత్రాన్ని ఎలా ప్రశంసిస్తుంది అంటూ నెటిజన్లు విమర్శలు మొదలు పెట్టారు. బహుశా ఈ విషయాని త్వరగా గ్రహించిన త్రిష ఆ పోస్ట్ డిలీట్ చేసి ఉంటుందని భావిస్తున్నారు.
Also Read: తల్లీకూతుళ్ల మాస్ జంపింగ్ ..కాంగ్రెస్ గెలవగానే రేవంత్ రెడ్డితో సురేఖ వాణి ఇలా