`త్రినయని` సీరియల్‌ నటుడు చందు సూసైడ్‌కి కారణం ఇదేనా?.. పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం? షాకిచ్చే నిజాలు

Published : May 17, 2024, 11:28 PM ISTUpdated : May 18, 2024, 10:52 AM IST
`త్రినయని` సీరియల్‌ నటుడు చందు సూసైడ్‌కి కారణం ఇదేనా?.. పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం? షాకిచ్చే నిజాలు

సారాంశం

తెలుగు బుల్లితెర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. `త్రినయని` సీరియల్‌కి చెందిన నటుడు చందు సూసైడ్‌ చేసుకోవడం కలకలం రేపుతుంది. పవిత్ర జయరాం మరణానికి ఆయనకు ఆత్మహత్యకి సంబంధం ఉందా?

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల సీరియల్‌ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. `త్రినయని` సీరియల్‌ నటుడు చందు(చంద్రకాంత్‌) ఆత్మహత్య చేసుకోవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పవిత్ర జయరాం మరణం నుంచి తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకోవడంతో టీవీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 

`త్రినయని` సీరియల్‌లోనే నటిస్తున్న చందు శుక్రవారం హైదరాబాద్‌లోని మణికొండలోగల తన అపార్ట్ మెంట్ లో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల బెంగుళూరు నుంచి వస్తుండగా మహబూబ్‌ నగర్‌ వద్ద పవిత్ర జయరాం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమె కన్నుమూశారు. అదే కారులో ఉన్న చంద్రకాంత్‌కి గాయాలతో బయటపడ్డారు.  అయితే చందు ఆత్మహత్యకి సంబంధించిన షాకింగ్‌ విషయాలు బయటకు వస్తున్నాయి. పవిత్ర జయారం మరణానికి, చందు ఆత్మహత్యకి లింక్‌ ఉందని తెలుస్తుంది. ఇద్దరూ ఒకే సీరియల్‌లో నటిస్తున్నారు. పవిత్ర జయరాం యాక్సిడెంట్‌లో మరణించగా ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు ఆత్మహత్యకి పాల్పడ్డాడని తెలుస్తుంది. 

దీనికి సంబంధించిన మరో షాకింగ్‌ విషయం బయటకు వస్తుంది. వీరిద్దరు గత కొంత కాలంగా రిలేషన్స్ లో ఉన్నారట. అప్పటికే వివాహం అయిన చందు.. పవిత్రతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టు ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం. చందు మరణానికి ఆ వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తుంది. పవిత్ర జయరాంతో చందు దాదాపు ఆరేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నారట. ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారట. దీంతో ఆ డిప్రెషన్‌ తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు టాక్. అయితే చందు ఆత్మహత్యకి అదే కారణమా? మరేదైనా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

నిజంగానే పవిత్ర జయరాం, చందు మధ్య వివాహేతర సంబంధం ఉందా? దీని వెనక ఎవరైనా ఉన్నారా? చందు మరణానికి అదే కారణమా? వ్యక్తిగత కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అసలు వివాహేతర సంబంధానికి సంబంధించి వార్తల్లో నిజం ఉందా అనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. 

చందు 2015లో శిల్పని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భార్యతో గొడవలు అయ్యాయని, దీంతో ఈ ఇద్దరు దూరంగా ఉంటున్నట్టు టాక్‌. ఈ క్రమంలోనే పవిత్రకి దగ్గరయ్యారని అంటున్నారు. ఈ నిజనిజాలు తెలియాల్సి ఉంది. ఇక త్రినయని` సీరియల్‌తోపాటు పలు సీరియల్స్ లో చందు నటించారు. ప్రస్తుతం  `రాధమ్మ పెళ్లి`, `కార్తీక దీపం` సీరియల్స్ లో ఆయన నటిస్తున్నారు.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Lord Ram Actors : రాముడి పాత్ర చేసిన అత్యంత ఖరీదైన 6గురు హీరోలు వీళ్లే.. ఎవరి రెమ్యూనరేషన్ ఎంత?
Karthika Deepam 2 Today Episode: జ్యోకు షాకిచ్చిన సుమిత్ర- పారు ఫైర్- స్వప్నకు పెళ్లిచూపులు-కాశీ బాధ