
స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న భారీ చిత్రం ‘యశోద’ (Yashoda). హరి - హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక క్రిష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వచ్చే నెలలోనే చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసేలా చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు. తాజాగా దీపావళి (Diwali 2022) సందర్భంగా సమంత అభిమానులకు మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ను అందించారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సై-ఫై ఫిల్మ్ ‘యశోద’ నుంచి చిత్రం మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రిలీజ్ పై అధికారిక ప్రకటన చేశారు. అక్టోబర్ 27న సాయంత్రం 5:36 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా సినిమాలోని ఇంట్రెస్టింగ్ వీడియో క్లిప్ ను విడుదల చేశారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ కు ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ దక్కింది. చివరిగా సమంత ‘జాను’లో లీడ్ యాక్ట్రెస్ గా అలరించింది. ఆ తర్వాత రెండేండ్లుగా ఎలాంటి సినిమా రాలేదు. రీసెంట్ గా ‘ఫుష్ప’ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
చైతూతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత నటించిన చిత్రాల్లో ముందు విడుదల కాబోతున్న చిత్రం ‘యశోద’. తెలుగు, తమిళంలో బైలింగ్వల్ గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ నవంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోోతోంది. సమంత అభిమానులు చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యశోద పాత్రలో సమంత నటిస్తుండగా.. ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేశ్, మురళీ శర్మలు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. మరోవైపు సమంత గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’లో, విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.