#Kantara:‘కాంతారా’ఇప్పటికి ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాకే

By Surya Prakash  |  First Published Oct 24, 2022, 3:38 PM IST

 తెలుగులో రిలీజ్ చేసిన అగ్రనిర్మాత అల్లు అరవింద్ తో పాటు మిగతా చోట్ల కొన్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అంతా లాభాల బాట పట్టారు.. ఇక నార్త్ లోనూ ‘కాంతార’ కలెక్షన్లు కుమ్మేస్తోంది.. 



గత పది రోజులుగా ఎక్కడ విన్నా ‘కాంతారా’కబుర్లే. దీపావళికు వచ్చిన సినిమాల కలెక్షన్స్ కూడా ‘కాంతారా’ ముందు వెలాతెలా పోతున్నాయి. ‘కాంతారా’థియేటర్స్ తగ్గించి, దీపావళి సినిమాలకు ఇచ్చినా తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. ఇప్పటిదాకా ‘కాంతారా’కు తెలుగు,హిందీ ,తమిళ,మళయాళ వెర్షన్ లో వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలిసుకున్న ట్రేడ్ షాక్ అయ్యిపోతోంది. వివరాల్లోకి వెళితే..

కన్నడలో ఇటీవల రిలీజ్ అయిన ‘కాంతారా’ చిత్రం అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది.రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ రిలీజ్ చేసింది. రిలీజైన తొలి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విమర్శకులు అయితే ఈ మూవీ ఓ రేంజిలో పొగుడుతూ  రేటింగ్ లు ఇచ్చారు. మొదటి రోజు మార్నింగ్ షోలు మ్యాట్నీలు కాస్త డల్ గా స్టార్ట్ అయినా ఈవెనింగ్ షోల నుండి ఈ మూవీ బాగా కలెక్ట్ చేస్తూ దూసుకుపోతోంది. దీంతో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 7వ రోజు కొత్త సినిమాలు రిలీజ్ అయినా అదే జోరుని చూపించింది.

Latest Videos

ఇప్పటిదాకా కన్నడ వెర్షన్ మినహాయించి మిగతా భాషల్లో ఈ సినిమా 60 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇది మామూలు విషయం కాదు. ఖచ్చితందా వంద కోట్లకు మరో వారంలో రీచ్ అయ్యిపోతుంది.  ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం అని తేలిపోయింది.  కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు.. భాషతో సంబంధం లేకుండా కాన్సెప్ట్ కీ, కల్చర్ కీ కనెక్ట్ అయ్యారు ఆడియన్స్.. దీంతో మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది.

సినిమా చూసిన అన్ని  రంగాలకు చెందిన ప్రముఖులు, ముఖ్యంగా వివిధ భాషల సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ‘కాంతార’ ఓ కళాఖండం అంటూ.. రిషబ్ శెట్టిని ఓ రేంజ్ లో పొగుడుతున్నారు.. దీంతో ఆయనకి మరిన్ని క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. మన రెబల్ స్టార్ ప్రభాస్ నుండి మాత్రం బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అందుకున్నానని చెప్పాడు. డార్లింగ్ ఇప్పటికే ‘కాంతార’ మూవీని రెండు సార్లు చూశాడట.. ముచ్చటగా మూడోసారి కూడా చూడడానికి ఆయన రెడీగా ఉన్నారని తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు రిషబ్ శెట్టి.

ఈ నేపధ్యంలో  ‘కాంతార’ చిత్రంలో అంతరించిపోతున్న తమ ప్రాచీన కళలను, వాటిని పెంచిపోషిస్తున్న కళాకారులను గుర్తించాలని.. అరవై సంవత్సరాలు పైబడిన దైవ నర్తకులకు.. వారి ఖర్చుల నిమిత్తం నెలకు రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ‘కాంతార’ సినిమాతో తమ సంస్కృతీ, సాంప్రదాయాలను అందరికీ తెలిసేలా చెయ్యడమే కాక.. కళనే నమ్ముకున్న తమకు ప్రభుత్వం సాయం చేయడానికి కారణమైన రిషబ్ శెట్టికి కళాకారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

click me!