
టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాతో ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న దర్శకుడు అభిషన్ జీవంత్. ఇటీవల చిన్న సినిమాలకు స్టార్స్ నుంచి అందుతున్న ప్రశంసల గురించి తెలిసిందే. తాజాగా ఈసినిమాకు కూడా స్టార్స్ హీరోలు, డైరెక్టర్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈక్రమంలో టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడిని హీరోలు సూర్య, శివకార్తికేయన్, నాని తో పాటు స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కూడా అభినందించారు. ఈసినిమా అద్భుతంగా ఉందంటూ విశ్లేషించారు. అభిషన్ పని తీరును ఎంతగానో మెచ్చుకున్నారు.
ఇక రీసెంట్ గా నేచురల్ స్టార్ నానిను కలిసి ఆయన అభిమనందనలు అందుకున్నారు డైరెక్టర్ అభిషన్ జీవంత్. ఇక తాజాగా జూన్ 9వ తేదీన అభిషన్ కు అతి పెద్ద సర్ ప్రైజ్ అందింది. తాను ఎంతగానో అభిమానించి, ప్రేమించే అభిమాన హీరో తలైవర్ రజనీకాంత్‌ను అతను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఎదురైన అనుభవాన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
అభిషన్ మాట్లాడుతూ, నేను సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానో ఈరోజే అర్థమైంది. రజనీకాంత్ సార్ నా పేరు పిలిచి, నన్ను గట్టిగా హత్తుకోగానే ఒళ్లంతా పులకరించిపోయింది. ఆయన నవ్వు చూసినప్పుడు చిన్నప్పుడు నేను చేసిన ప్రార్థనలు అన్నీ ఆలస్యంగా అయినా .. నాకు అవసరమైన సమయంలో వచ్చాయని అనిపించింది. ఆయన ఎంత మంచి మనిషి! ఎంత నిరాడంబరంగా ఉంటారు! అని చెప్పుకొచ్చాడు.
అభిషన్ తన అభిమాన నటుడిని ప్రత్యక్షంగా కలవడం, ఆయన చేత ప్రోత్సాహం పొందడం తన సినీ ప్రయాణంలో ఒక గొప్ప మలుపుగా భావిస్తున్నాడు. ఈ భేటీ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి. అభిషన్ రాబోయే ప్రాజెక్టులపై సినీ పరిశ్రమలో ఆసక్తి పెరుగుతుంది. నెక్ట్స్ అతను ఎవరితో సినిమా చేస్తాడా అని చూస్తున్నారు. అంతే కాదు ఏ స్టార్ నుంచి అతనికి అవకాశం అందుతుందా అని చూస్తున్నారు.