డైరెక్టర్ సుకుమార్‌కు దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి కృత‌జ్ఞ‌తలు, ఎందుకంటే..?

Published : Jun 17, 2022, 02:09 PM IST
డైరెక్టర్ సుకుమార్‌కు దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి కృత‌జ్ఞ‌తలు,  ఎందుకంటే..?

సారాంశం

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వారసుడు.. ఆశిష్ రెడ్డి.. టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కు ప్రత్యేకంగా కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఇంతకీ సుకుమార్ కు ఆశిష్ ఎందుకు థ్యాక్స్ చెప్పారు..?   


స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు  వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు  ఆశిష్ రెడ్డి.  ఇప్ప‌టికే రౌడీ బాయ్స్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.  ఈ యంగ్ హీరో ప్ర‌స్తుతం సెల్ఫిష్ సినిమాతో బిజీగా ఉన్నాడు. విశాల్ కాశి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 

 ఇక ఆశిష్ రెడ్డి స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌  కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. అంతే కాదు సుకుమార్ తో క‌లిసి దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడుయంగ్ హీరో. స్టార్ డైరెక్టర్ తో  చాలాక్లోజ్ గా ఉన్న ఫోటోస్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆశీష్. అయితే వీరు కలవడం, ఆశీష్ సుకుమార్ కు థ్యాంక్స్ చెప్పడంపై చాలా డౌట్స్ వచ్చా యి .. వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటీ అంటే.. అశీష్ సినిమాకు సుకుమార్ హెల్ప్ చేశారట. దాని గురించి పోస్ట్ పెట్టారు యంగ్ హీరో. 

 

అశీష్ ఏమన్నారంటే.. సెల్ఫిష్ సినిమాకు మీ గొప్ప‌ ఇన్ పుట్స్, సంభాష‌ణలు అందించ‌డ‌మే కాకుండా సినిమాను ప‌ర్య‌వేక్షిస్తూ..ప్రాజెక్టును మీ భుజాల‌పై మోస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు సుక్కూ అన్న‌. సెల్ఫిష్ త్వ‌ర‌లోనే మీ ముందుకొస్తుంది.... అంటూ విశాల్ కాశి, సుకుమార్‌తో దిగిన స్టిల్ షేర్ చేయ‌గా..నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. 

ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ల‌పై దిల్ రాజు, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ ప్రాజెక్టుకు మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. మ‌రిన్ని వివ‌రాల‌పై సుక్కూ టీం త్వ‌ర‌లో స్ప‌ష్ట‌త రానుంద‌ని టాలీవుడ్ స‌ర్కిల్ టాక్‌. ఇప్ప‌టికే విడుద‌లైన సెల్ఫిష్ ఫ‌స్ట్ లుక్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌