`స్పై` వివాదాలకు ఫుల్‌ స్టాప్‌.. దిగొచ్చిన నిఖిల్‌.. టార్గెట్‌ లాక్‌

Published : Jun 18, 2023, 05:21 PM ISTUpdated : Jun 18, 2023, 05:24 PM IST
`స్పై` వివాదాలకు ఫుల్‌ స్టాప్‌.. దిగొచ్చిన నిఖిల్‌.. టార్గెట్‌ లాక్‌

సారాంశం

హీరో నిఖిల్‌ కి, `స్పై` నిర్మాత కె రాజశేఖర్‌ రెడ్డికి మధ్య కొన్ని రోజులుగా విభేదాలు నెలకొన్నాయి. ఇద్దరికి పడటం లేదు. రిలీజ్‌ డేట్‌ పై సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు దిగిచ్చారు. 

నిఖిల్‌ హీరోగా రూపొందుతున్న `స్పై` చిత్రం గత కొన్ని రోజులుగా వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. హీరో నిఖిల్‌కి, నిర్మాత కె. రాజశేఖర్‌ రెడ్డికి పడటం లేదు. ఇద్దరి మధ్య ఏర్పడిని భేదాభిప్రాయాల వల్ల సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంది. అంతకు ముందు సినిమాని జూన్ 29న విడుదల చేస్తామని తెలిపారు. కానీ కొంత షూటింగ్‌ పార్ట్ మిగిలి ఉందని, డబ్బింగ్‌ కూడా చెప్పలేదని ఎలా రిలీజ్‌ చేస్తారని ఆ మధ్య నిఖిల్‌ ఓ మీడియా ప్రతినిధితో తెలిపారు. 

ఆ సమయంలోనే హీరో డబ్బింగ్‌తో పనిలేదు, తాను రిలీజ్‌ చేస్తానని నిర్మాత ప్రకటించారు. దీంతో ఈ ఇద్దరి మధ్య వివాదం రాజుకుందనే విషయం బయటపడింది. అయితే సుభాష్‌ చంద్రబోస్‌ కథతో, ఆయన మిస్సింగ్‌ కేసు నేపథ్యంలో ఆయన బతికి ఉన్నాడా? చనిపోయారా? అనే  రహస్యాల అన్వేషణ నేపథ్యంలో స్పై థ్రిల్లర్‌గా ఈ చిత్రం సాగుతుందని టీజర్‌, ట్రైలర్‌లో వెల్లడించారు. ఇలాంటి దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇలాంటి వివాదం నెలకొనడం ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా నిర్మాత ఏకంగా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. దీంతో ఈ వివాదం పీక్ లోకి వెళ్లిందని అంతా భావించారు. 

కానీ నిఖిల్‌ అనూహ్యంగా సర్‌ప్రైజ్‌ చేశారు. ఆయన ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తూ ట్వీట్‌ చేయడం విశేషం. దీంతో వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్టే అని అర్థమవుతుంది. అటు నిర్మాతగానీ, ఇటు నిఖిల్‌ కానీ దిగొచ్చారని, మొత్తానికి ఇద్దరి మధ్య రాజీకుదిరిందని అర్థమవుతుంది. తాజాగా నిఖిల్‌ ట్వీట్‌ చేస్తూ అన్నింటిని లాక్‌ చేశారు. `క్వాలిటీ లాక్‌, టార్గెట్‌ లాక్‌, స్పై లాక్‌.. జూన్‌ 29న వరల్డ్ వైడ్‌గా థియేటర్లో విడుదలవుతుంది` అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పై రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని షేర్‌ చేశారు. దీంతో `స్పై` వివాదానికి ముగింపు పడిందనే చెప్పాలి. 

ఇక ఈ చిత్రానికి ఎడిటర్‌ గ్యారీ బి హెచ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సీజీఐ వర్క్ జరుగుతుందట. నాలుగు సీజీఐ కంపెనీలకు చెందిన వెయ్యి మంది టెక్నీషియన్లు పనిచేస్తున్నారని టీమ్‌ తెలిసింది. అనుకున్న టైమ్‌కి సినిమాని రిలీజ్‌ చేసేలా రెడీ చేస్తున్నారట. ఈ సినిమాని తెలుగుతోపాటు తమిళం, మఙందీ, కన్నడ, మలయాళంలోనూ రిలీజ్‌ చేస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల దీనికి సంగీతం అందించారు. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్నారు.  ఐశ్వ‌ర్య మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా, ఆర్య‌న్ రాజేష్, స‌న్యా ఠాకూర్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?