
షూటింగ్స్ బంద్‌పై నిర్ణయానికి వచ్చారు టాలీవుడ్ అగ్రనిర్మాతలు. అవసరమైతే రెండు, మూడు నెలలు షూటింగ్ బంద్ చేద్దామని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. నిర్మాణ వ్యయం తగ్గకపోతే ఇండస్ట్రీకి మనగడ లేదని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ తర్వాత థియేటర్ల పరిస్ధితి రోజురోజుకు దిగజారుతోంది. పదివారాల తర్వాతే ఓటీటీల్లో సినిమాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆగస్ట్ 1 నుంచి ఓటీటీల్లో విడుదలకు పది వారాల లాక్ ఇన్ పీరియడ్ అమలు చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఆగస్ట్ 1 నుంచి టాలీవుడ్‌లో షూటింగ్ బంద్ చేయాలని నిర్మాతలు నిర్ణయానికి వచ్చినట్లుగా కథనాలు వస్తున్నాయి.