
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనను నటుడిగా కన్నా.. వ్యక్తిగతంగా అభిమానించే, ఆరాధించే వారు లక్షల్లో ఉంటారు. అప్పు కూడా సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు.. ఆఫ్ స్క్రీన్ లోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణవార్త విన్నాక అభిమానులు, కన్నడ ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. ఆయనను అభిమానించే వారు ఇప్పటికే ఆ చేదునిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ తాజాగా మరోసారి అభిమానాన్ని చాటుకున్నారు. ‘ట్విట్టర్’పై ఫైర్ అవుతూ పునీత్ పై ఉన్న ప్రేమను చూపించారు. ఇంతకీ రీజన్ ఏంటంటే.. పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన తర్వాత ట్విట్టర్ సంస్థ ఆయన అకౌంట్ ను అన్ వెరిఫైడ్ చేసింది. గత కొద్ది రోజులుగా అలాగే కొనసాగుతుండటం గమనించిన అభిమానులు తాజా అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే రీవెరిఫై చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు #ReverifyPuneethRajkumarTwitter అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ సంస్థకు రిక్వెస్ట్ లు పెడుతున్నారు. ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సిద్ధార్థ శుక్ల లా అకౌంట్స్ ఎలాగైతే వెరిఫైడ్ గా కొనసాగుతున్నాయో.. అలాగే పునీత్ అకౌంట్ నూ రీవెరిఫై చేయాలని కోరుతున్నారు.
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అభిమానులను ఫిదా చేసిన పునీత్ రాజ్ కుమార్ రీసెంట్ గా ‘జేమ్స్’ చిత్రంతో అలరించాడు. ఆయన నటించిన మరో చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉంది. అందులో పునీత్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘గంధాడ గుడి’ (Gandhada Gudi) ఒకటి. అటవీ, జంతు సంరక్షణ నేపథ్యంలో రూపొందిన ఈ డాక్యుమెంటరీ కోసం ప్రేక్షకులూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.