పూజా హెగ్డే ఇంట తీవ్ర విషాదం..రెండు రోజుల క్రితమే చెల్లి పెళ్ళి.. అంతలోనే...?

Published : Jan 13, 2024, 09:19 AM IST
పూజా హెగ్డే ఇంట తీవ్ర విషాదం..రెండు రోజుల క్రితమే చెల్లి పెళ్ళి.. అంతలోనే...?

సారాంశం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రెండురోజుల ముందు వరకు చెల్లి పెళ్ళిని ఎంజాయ్ చేసిన పూజా.. సడెన్ గా తనకు ఎంతో ఇష్ట మైన వ్యక్తిని కోల్పోయింది. 

హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తనఅమ్మమ్మను కోల్పోయింది. ఆమె అంటేపూజాకు ఎంతో ఇష్టం.. తనను ప్రాణంగా చూసుకునేదట. పూజా హెగ్డేకి ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మ గారు రీసెంట్ గా మరణించారట. పూజా హెగ్డే మదర్ లతా హెగ్డే మదర్  పూజాకి అమ్మమ్మ కన్నుమూయడంతో.. వారి ఇంట విషాద ఛాలయలు అలముకున్నాయి. పూజా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుందట. అంతే కాదు  గతంలో ఆమెతో గడిపిన మధుర క్షణాలకి సంబంధించిన ఫోటోలను చాలా సార్లు షేర్ చేసుకుంది పూజా హెగ్డే. తాజాగా ఓ ఫోటోని షేర్ చేసి..’వుయ్ మిస్ యు అజి’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ తో ఈ విషాదాన్ని అభిమానులతో పంచుకుంది బుట్టబొమ్మ. 

ప్రస్తుతం పూజా హెగ్డే పోస్ట్ వైరల్ అవుతోంది. పూజాను అభిమానులు ఓదార్చుకతున్నారు. ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది 
రెండు రోజుల క్రితం పూజ హెగ్డే  సిస్టర్ భూమి శెట్టి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్ళిలో తన ఫ్యామిలీతో కలిసి  బాగా ఎంజాయ్ చేసింది పూజ. ఆ సంతోషం ఎక్కువ రోజులు క్యారీ అవ్వకుండానే.. తమతో పాటు.. పెళ్ళిలో సంతోషంగా గడిపిన తన అమ్మమ్మ వెళ్ళిపోవడం..  ఫ్యామిలీని   విషాదంలోకి నెట్టేసింది. 

ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక ఇబ్బంది పడుతోంది పూజా.. గుంటూరు కారం నుంచి తప్పుకున్న పూజా.. సల్మాన్ తో కిసికా జాన్ మూవీలో చేసింది. బాలీవుడ్ లో ఈమూవీ ప్లాప్ అవ్వడంతో.. అక్కడ కూడా ఆమెకు పెద్దగా ఆపర్లు లేవు. తెలుగులో ఇప్పటి వరకూ ఆమె కొత్త సినిమాలేవి సైన్ చేయలేదు. ఆచార్య ప్లాప్ తరువాత ఆమెకు అవకాశాలు లేవు. ఇండస్ట్రీలో పూజా వరుస ప్లాప్ లు చూడటంతో.. ఐరెన్ లెగ్ అన్న పేరు తెచ్చుకుంది. ఒకప్పులు వరుస హిట్లు చూసిన బ్యూటీకి ఇప్పుడు టైమ్ కలిసిరావడంలేదు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?