మహేష్ బాబుకు షాక్.. శ్రీలీల స్వీటు.. నువ్వే నా హార్ట్ అంటూ.. బ్యానర్లు కట్టిన డై హార్ట్ ఫ్యాన్స్

By Mahesh JujjuriFirst Published Jan 13, 2024, 7:32 AM IST
Highlights

మహేష్ బాబుకు షాక్ ఇచ్చారు ఫ్యాన్స్.. బాబు సినిమారిలీజ్అయ్యిందంటే.. బ్యానర్లు.. పోస్టర్లు ..హంగామాఅది వేరే ఉంటుంది.ఈసారి గుంటూరు కారం సినిమాకు అది రెట్టింపు అయ్యింది. కాని ఇక్కడే చిన్నట్విస్ట్ ఉంది.
 

స్టార్ హీరో సినిమా అంటే రెచ్చిపోతారు ఫ్యాన్స్.. థియేటర్ల దగ్గ హంగామా మామూలుగా ఉండదు. ఇక తమ అభిమాన హీరో బ్యానర్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు.. ఎంత వీలైతే అంత ఎత్తు  కటౌట్లు పెట్టాలనిప్లాన్ చేశారు. ఎక్కడిక్కడ సొంత పేర్లతో బ్యానర్లు కడతారు.. ఇక సూపర్ స్టార్ అభిమానుల అభిమానం అయితే అంతా ఇంతా కాదు. మహేష్ బాబు కోసం పడి చచ్చిపోతుంటారు జనాలు. తాజాగా గుంటూరు కారం సినిమాతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేస్తున్నాడు సూపర్ స్టార్. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమాలో హీరోయిన్ గా శ్రీలీల సందడి చేసింది. 

ఇక ఈమూవీ పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే అంతే విమర్షలు కూడా వస్తున్నాయి గుంటూరు కారంసినిమాపై . ముఖ్యంగా డైరెక్టర్ త్రివిక్రమ్ పై విమర్షలు  ఎక్కువగా వస్తున్నాయి. అయితే హిట్ అయినా ప్లాప్అయినా..హరోగారి కటౌట్ కు వచ్చే ఇబ్బందేమి లేదుగా..అయితే మహేష్ బాబు భారీ కటౌట్లు.. పాలాభిషేకాలు,దండలుఇలాహడావిడి కొనసాగింది.అయితే ఈసారి కొంత మంది అభిమానులు షాక్ ఇచ్చారు.  మహేష్ తో పాటు.. హీరోయిన్  శ్రీలీలకు కూడా పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టేశారు. అదిరిపోయే కొటేషన్లు కూడా రాశేశారు. 

Latest Videos

గుంటూరు కారంఘాటు..మూవీకి హీరోయిన్ శ్రీలీల స్వీటు..అందుకే నువ్వే నా హార్టు అంటూ.. స్పెషల్ కొటేషన్లు కొట్టించి మరీ  బ్యానర్లు కట్టేశారు. అంతే కాదు... శ్రీలీల డైహార్ట్ ఫ్యాన్స్ అంటూ.. కింద పెద్ద  ట్విస్ట్ కూడా ఇచ్చారు. దాంతో మహేష్ బాబు డైహార్ట్ ఫ్యాన్స్ఒకింత ఓర్చుకోలేక పోతున్నారట. ఇక ఈ బ్యానర్ లో వారి పర్సనల్ ఫోటోలతో పాటు.. ఒక కార్నర్ కు మహేష్ బాబు ఫోటో కూడా పెట్టారు. దాంతో ఈ బ్యానర్ సోషల్ మీడియాలో  ఫుల్ గా వైరల్ అవుతుంది. 

అయితే ఇలా హీరోయిన్లకు బ్యానర్లు, కటౌట్లుపెట్టడం కొత్తమేమికాదు..గతంలో స్టార్ హీరోయిన్ అనుష్కాతో పాటు.. రీసెంట్ ఇయర్స్ లో సమంత కు కూడా స్పెషల్ గా బ్యాన్లు .. కటౌట్లు పెట్టారు. ఇక ఆలిస్ట్ లోకి తాజాగా శ్రీలీలవచ్చి చేరింది.  శ్రీలీలకు బ్యానర్ వేయించడం. దాని మీద ఇలాంటి కొటేషన్ రాయడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. చాలా మంది ఈ బ్యానర్ చూసి నవ్వుతుంటే, మరి కొంతమంది కొటేషన్లు చూసి ఫన్నీఫీల్ అవుతున్నారు. ఇంకొంత మంది మాత్రం  ఇదేమి పిచ్చి అంటుంటే కొంతమంది మాత్రం హీరోకే బ్యానర్లు కట్టాలా..? హీరయిన్స్ కు డైహార్ట్ ఫ్యాన్స్ ఉండకూడదా అంటూ ప్రశ్నిస్తున్నారు..? 

click me!