ఇటీవల `జైలర్` బ్లాక్ బస్టర్‌తో జోరు మీదున్నారు రజనీకాంత్. నెక్ట్స్ సినిమాకి సిద్ధమవుతున్నాయి. అయితే ఇందులో తెలుగు హీరో నటించబోతున్నారట.
సూపర్ స్టార్ రజనీకాంత్ `జైలర్` చిత్రంతో సాలిడ్‌గా కమ్ బ్యాక్ అయ్యారు. తన రేంజ్ ఏంటో మరోసారి చూపించారు. ఏజ్ పెరిగినా తన క్రేజ్ తగ్గలేదని చూపించారు. సరైన సినిమా పడితే బాక్సాఫీసు ఊగిపోవాల్సిందే అని చాటి చెప్పారు. ఇటీవల విడుదలైన `జైలర్` చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కోలీవుడ్ గత రికార్డులను బ్రేక్ చేసింది. సరికొత్త సంచలనంగా మారింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రమిది. అంతకు ముందు ఈ దర్శకుడికి హిట్ లేదు. కానీ రజనీ అతనిలోని టాలెంట్‌ని నమ్మాడు. ఆ నమ్మకమే నిజమైంది.
`జైలర్` ఆనందంలో ఉన్న రజనీకాంత్ ఇప్పుడు నెక్ట్స్ సినిమాకి సిద్ధమవుతున్నాడు. `జై భీమ్` దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. రజనీ 170వ మూవీగా ఇది రూపొందనుంది. వినాయకచవితి పండుగ సందర్బంగా ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇందులో ఇప్పటికే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్ర కోసం ఎంపికయ్యారు. అలాగే మంజు వారియర్ నటిస్తుంది. దీంతోపాటు ఓ తెలుగు స్టార్ కూడా ఇందులో భాగం కాబోతున్నారనే వార్తలు వినిపించాయి.
ప్రధానంగా శర్వానంద్, నాని పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా మరో కొత్త పేరు వినిపిస్తుంది. ఈ ఇద్దరు కాదు రానా నటించబోతున్నట్టు తెలుస్తుంది. కీలక పాత్ర కోసం రానాని ఎంపిక చేశారని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం క్రేజీగా మారింది. ఇప్పుడు పెద్ద స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా లెవల్‌లో విడుదలవుతున్నాయి. దీంతో అన్ని భాషలకు చెందిన నటులను కీలక పాత్రల్లో తీసుకుని అక్కడి మార్కెట్‌ని క్యాప్చర్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా విషయంలోనూ ఇతర భాషల హీరోలను తీసుకుంటున్నట్టు సమాచారం.
లైకా ప్రొడక్షన్స్ నిర్మించే ఈ చిత్రానికి అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. `జైలర్`కి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ అనే విషయం తెలిసిందే. సినిమా సక్సెస్‌లో అనిరుథ్ బీజీఎం హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే సక్సెస్‌ని కంటిన్యూ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రజనీకాంత్ ముస్లీం పోసీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారని సమాచారం.
ఇక రానా ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్ లు చేస్తున్నారు. `హిరణ్య కశ్యప` అందులో ఒకటి. త్రివిక్రమ్ దీనికి కథ, మాటలు అందిస్తున్నారు. దీంతోపాటు తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `నేనే రాజు నేనే మంత్రి`కిది సీక్వెల్‌గా ఉండబోతుందని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.