Rajamouli Tweets: ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు అడ్డుతప్పుకున్నందుకు రాజమౌళి థ్యాంక్స్.. ఎవరెవరికి చెప్పాడంటే..?

By Mahesh JujjuriFirst Published Dec 21, 2021, 3:46 PM IST
Highlights

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సినిమాలకు.. మేకర్స్ కు .. హీరోలకు స్టార్ డైరెక్టర్ రాజమౌళి థ్యాంక్స్ చెప్పారు. సంక్రాంతి రిలీజ్ లు అస్తవ్యస్తం కాకుండా కాపాడినందుకు ధన్యవాదాలు చెప్పారు.

దాదాపు మూడేళ్లు షూటింగ్ చేసుకున్న ట్రిపుల్ ఆర్(RRR) మూవీ.. రెండు రీలీజ్ డేట్స్ మార్చుకుని సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ కాబోతోంది. అయితే అంతకు ముందే సంక్రాంతి రిలీజ్ డేట్స్ ను లాక్ చేసుకున్న సినిమాల విషయంలో కన్ ఫ్యూజన్ ఏర్పడింది. దాంతో ఏం జరుగుతుందా అని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆడియన్స్ కూడా ఆసక్తిగ గమనించారు. ట్రిపుల్ ఆర్ కు ఎదురు వెళ్ళి నష్టపోతాయా.. లేక బరి నుంచి తప్పుకుంటాయా అని ఈగర్ గా వెయిట్ చేశారు.

ట్రిపుల్ ఆర్ అనౌన్స్ మెంట్ ముందు వరకూ సంక్రాంతి బరిలో మహేష్ బాబు(Mahesh) సర్కారువారి పాట, వెంకటేష్ – వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ ఎఫ్3, పవర్ స్టార్ పవన్ కళ్యాన్(Pawan Kalyan) భీమ్లా నాయక్, ప్రభాస్(Prabhas) రాధేశ్యామ్ ఉన్నాయి. అయితే అనూహ్యాంగా సంక్రాంతి బరిలో పోటీ  నుంచి.. అందరికంటే ముందు తప్పుకున్నాడు సూప్ స్టార్ హేష్ బుబు. సర్కారువారి పాట సినిమాను ఏప్రిల్ 2కు రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు.

ఇక సంక్రాంతి బరిలో ఉన్న భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాలు తగ్గేదే లే అన్నట్టు కామ్ గా ఉన్నాయి మొన్నటి వరకూ. కాని ఇంత పెద్ద సినిమాలు పోటీలో ఉంటే.. థియేటర్ల సమస్య వస్తుంది. అన్ని సినిమాల కలెక్షన్ల పై దెబ్బ పడుతుంది. దాంతో సినిమా పెద్దలు రాయబారాలు చేసుకుంటూ చర్చలు జరిపారు. దాంతో ఫైనల్ గా రిలీజ్ డేట్స్ పై క్లారిటీ వచ్చింది. బీమ్లా నాయక్ ను ఫిబ్రవరి 25కు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు టీమ్.

దాంతో సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నందకు..ట్రిపుల్ ఆర్ రిలీజ్ కు సహకరిస్తున్నందు రాజమౌళి (Rajamouli)ఒక్కొక్క టీమ్ కు థ్యాంక్స్ చెపుతూ.. ట్వీట్ చేశారు. ముందుగా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నందుకు సూపర్ స్టార్ మహేష్ బాబకు ధన్యవాదాలు చెప్పారు జక్కన్న. పొంగల్ రిలీజ్ లు అస్తవ్యస్థం కాకుండా కాపాడినందకు థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా మైత్రీ మేకర్స్ ను కూడా అభినందించారు.

. was the one who took the initative in decluttering the Pongal releases... Even though was a perfect Pongal film, he moved it to summer and created a healthy atmosphere. Thanks to my Hero 🙂 and also to the entire team at …

— rajamouli ss (@ssrajamouli)

 

ఇక ఈరోజు( డిసెంబర్ 21) భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అనౌస్స్ చేశారు మేకర్స్. సంక్రాంతి బరి నుంచి ఈ మూవీని పోస్ట్ పోన్ చేసినందుకు ప్రొడ్యూసర్ చినబాబుతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాన్(Pawan Kalyan) ను  అభినందించారు రాజమౌళి. వీరికి కూడా స్పెషల్ థ్యాక్స్ చెపుతూ ట్వీట్ చేశారు. మరో వైపు జనవరి 12న రిలీజ్ కావల్సిన భీమ్లా నాయక్ మూవీ పిబ్రవరి 25కు పోస్ట్ పోన్ అయ్యింది. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు టీమ్.

The decision by Chinababu garu and Pawan Kalyan garu to defer the release date of is well appreciated. Wishing the team all the very best…:)

ఇక ఈరెండు సినిమాలతో పాటు సంక్రాంతి బరిలో ముందు నుంచీ ఉన్న సినిమా ఎఫ్3. దిల్ రాజు నిర్మించిన ఈమూవీ.. ట్రిపుల్ ఆర్  రావడంతో.. సక్రాంతి బరి నుంచి పిబ్రవరి 25కు రిలీజ్ డేట్ మార్చుకుంది. ఇటు బీమ్లానాయక్ కూడా సక్రాంతి బరి నుంచి తప్పుకుని ఎఫ్3 ఫిక్స్ చేసుకున్న పిబ్రవరి 25కు  చేరడంతో.... ఎఫ్3 మూవీ మరోసారి రిలీజ్ డేట్ ను త్యాగం చేసి.. సంమ్మర్ కు షిప్ట్ అయ్యింది. ఎఫ్ 3 ఎప్రిల్ 29న రిలీజ్ కాబోతున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. ఇక ఎప్3 రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేసి సహకరించినందకు దిల్ రాజుకు స్పెషల్ ట్వీట్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు జక్కన్న.

click me!